మరోవైపు టిక్కెట్ రేట్లు కూడా పెరిగాయి. వీటికి తోడు భారీ అంచనాలు ఉండనే ఉన్నాయి. పైగా బాహుబలి సాధించిన విజయంతో ప్రభాస్ కు టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు పాపులారిటీ భారీగా పెరిగిపోయింది .ఈ నేపథ్యంలో సాహో సినిమా బాహుబలి-2 వసూళ్లను అధిగమిస్తుందా అనే ఇంట్రెస్టింగ్ డిస్కషన్ షురూ అయింది. ఒకసారి ఆ వివరాలేంటో మీరే చూసెయ్యండి. 


బాహుబలి ఇచ్చిన విజయంతో దేశ ప్రజలకు బాగా దగ్గరైన ప్రభాస్ అన్ని బాషల ప్రేక్షకులకు నచ్చేలా సాహో సినిమా కోసం కష్టపడ్డాడు. బాహుబ‌లి కోసం ఏకంగా నాలుగేళ్లు క‌ష్ట‌ప‌డ్డ ప్ర‌భాస్ సాహో కోసం రెండేళ్లు క‌ష్ట‌ప‌డ్డాడు. రూ.350 కోట్ల భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కుతోన్న ఈ సినిమాపై అభిమానుల అంచ‌నాలు మామూలుగా లేవు. అందుకు త‌గ్గ‌ట్టుగానే ట్రేడ్ వ‌ర్గాల్లో బిజినెస్ జ‌రుగుతోంది. ఇక ఈ సినిమా ఇండియాతో మొదలుకుని ఓవర్సీస్ దాకా ఎంత రాబట్టవచ్చు అన్న దానిపై కూడా ట్రేడ్ వ‌ర్గాలు లెక్కులేసుకుంటున్నాయి. ఈ సినిమాకు జ‌రుగుతోన్న బిజినెస్‌తో పాటు బ‌యర్లు పెడుతోన్న రేట్లు కూడా మైండ్ బ్లాక్ అయ్యేలా ఉన్నాయి. 


ఇప్పుడు సౌత్ లోనే కాదు దేశంలోని సినిమా ట్రేడ్ కళ్లన్నీ సాహో ఫస్ట్ డే కలెక్షన్స్ మీదే ఉన్నాయి. విడుదలకు 24 గంటల సమయమే ఉంది. ఇక దీనికి సంబంధించిన అంచనాలు లెక్కలతో బుర్రలు వేడెక్కిస్తున్నారు. 350 కోట్ల  బడ్జెట్ అయ్యింది కాబట్టి అంతే మొత్తంలో షేర్ రావాలి దానికి రెండింతలు మించి అంటే ఓ ఐదు వందల కోట్లు దాటితేనే సాహో కమర్షియల్ లెక్కల్లో సేఫ్ ప్రాజెక్ట్ అనిపించుకుంటుంది. ఇక్కడ కీలక పాత్ర పోషించేది మొదటి రోజు వసూళ్లు అని వేరే చెప్పాల్సిన పని లేదు.  ఇండియాతో మొదలుకుని ఓవర్సీస్ దాకా ఎంత రాబట్టవచ్చు అనే దాని మీద ఇప్పటికే అభిమానులు చాలా ఆశలు పెట్టుకున్నారు. 


ఇక ఇప్పటివరకు తెలుగు సినిమాల రికార్డులను పరిశీలిస్తే... తెలగు సినిమా ఇండస్ట్రీలో ప్రపంచవ్యాప్తంగా అత్యధిక షేర్ సాధించిన చిత్రంగా బాహుబలి2 మొదటి స్థానంలో ఉంది. బాహుబలి2 123 కోట్లతో అగ్రస్థానాన్ని కైవసం చేసుకోగా, బాహుబలి రూ.46 కోట్లతో రెండో స్థానంలో ఉంది. ఇక పవర్ స్టార్ పవన్ కల్యాణ్ త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన  అజాతవాసి  39.30 కోట్లతో మూడో స్థానంలో ఉంది.  అరవింద సమేత 37.20 కోట్ల, ఖైదీ నంబర్ 150  35.22 కోట్లు రాబట్టింది. 


ఒకవేళ  100 కోట్ల ఓపెనింగ్ ను గనుక రాబడితే బాహుబలి 2 తరువాత  మొదటి రోజే ఈ ఘనత  సాధించిన రెండవ సినిమాగా  రికార్డు సృష్టించనుంది సాహో. ఇక ఈ రెండు  తెలుగు సినిమాలే కావడం  విశేషం.  చూద్దాం మరి  సాహో ఈ రికార్డు ను అందుకుంటుందో లేదో.  'రన్ రాజా రన్'  ఫేమ్ సుజీత్ తెరకెక్కించిన  ఈ చిత్రంలో ప్రభాస్ సరసన  బాలీవుడ్  బ్యూటీ శ్రద్దా కపూర్ హీరోయిన్ గా నటించింది. 


ఇక ఇప్పటివరకు భారీ వసూళ్లు రాబట్టిన సినిమాలు  
దంగల్               – రూ. 2122 కోట్లు
బాహుబలి -2       – రూ. 1788 కోట్లు
పీకే                      – రూ. 792 కోట్లు
2.O                     – రూ. 723 కోట్లు
బాహుబలి           – రూ. 650 కోట్లు


మరింత సమాచారం తెలుసుకోండి: