మెగాస్టార్ చిరంజీవి సైరా సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు చురుగ్గా సాగుతున్నాయి.  ఇప్పటికే సినిమాకు సంబంధించిన కార్యక్రమాలను షురూ చేశారు.  టీజర్ కు మంచి టాక్ రావడంతో బిజినెస్ పరంగా సినిమా భారీ స్థాయిలో ఉన్నది.  సినిమాపై అంచనాలు పెంచింది.  సాహో, ఆర్ఆర్ఆర్ ను మించేలా బిజినెస్ చేస్తున్నది.  చాలా ఏరియాలలో ఎవరూ ఊహించని విధంగా బిజినెస్ చేసింది ఈ సినిమా.  


మెగాస్టార్ పై ఉన్న అభిమానంతో పాటు సినిమాపై ఉన్న నమ్మకంతో ఫ్యాన్సీ రేట్ ఇచ్చి హక్కులు సొంతం చేసుకుంటున్నారు. త్వరలోనే ట్రైలర్ ను రిలీజ్ చేస్తారట.  ఆడియో వేడుకను భారీ ఎత్తున హైదరాబాద్ లో నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు.  తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కేరళ, కర్ణాటక, ముంబై లో కూడా భారీ ఎత్తున వేడుకలు నిర్వహించేందుకు యూనిట్ రెడీ అవుతున్నది. 

ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఎడిటింగ్ పూర్తయినట్టు సమాచారం.  దాదాపు 2గంటల 45 నిమిషాల నిడివితో ఉన్న ఈ సినిమాను ఇంకాస్త ట్రిమ్ చేయడానికి దర్శకుడు ప్రయత్నం చేస్తున్నారు.  దర్శకుడికి పూర్తి స్వేచ్ఛను ఇచ్చి సినిమాను ఎడిట్ చేస్తున్నారు.  ఇకపోతే, ఈ సినిమాకు సంబంధించిన డబ్బింగ్ కార్యక్రమాలు కూడా చివరి దశకు చేరుకున్నాయి.  


మెగాస్టార్ చిరంజీవి డబ్బింగ్ పూర్తయింది.  కేవలం 20 రోజుల వ్యవధిలోనే ఈ సినిమా డబ్బింగ్ ను పూర్తి చేసుకున్నారు చిరంజీవి.  చారిత్రాత్మక కథతో తెరకెక్కుతున్న సినిమా కాబట్టి, చాలా జాగ్రత్తలు తీసుకోవాలి.  వాయిస్ మాడ్యులేషన్ వేరియేషన్స్ ఉండాలి.  వేగంగా డబ్బింగ్ పూర్తి చేయడానికి కుదదరు.  కానీ, మెగాస్టార్ తన అనుభవం దృష్ట్యా సైరా డబ్బింగ్ ను 20రోజుల్లోనే కంప్లీట్ చేసుకున్నారు.  మరో పది రోజుల్లో ట్రైలర్ ను రిలీజ్ చేయబోతున్నారని వినికిడి.  అమితాబ్ లాంటి భారీ క్యాస్టింగ్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా అక్టోబర్ 2న రిలీజ్ కాబోతున్నది.  


మరింత సమాచారం తెలుసుకోండి: