రెబల్ స్టార్ ప్రభాస్ ఈ మద్యే సాహో సినిమాతో అందరిని పలకరించిన విషయం తెలిసిందే. బాహుబలి తరువాత ప్రభాస్ నటించిన సినిమా కావడంతో ఈ సాహో పై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. వాటిని అందుకుంటూ ఈ సాహో సినిమా ఇప్పటికే 400 కోట్లకి పైగా కలెక్షన్స్ ని రాబట్టి మరో ఇండస్ట్రీ హిట్ దిశగా ముందుకుసాగిపోతుంది.

ఇకపోతే ఇదే సమయంలో హైదరాబాద్ లో గత కొన్ని రోజులనుండి వైరల్ ఫివర్స్ ఎక్కువై పొయ్యాయి. తాజాగా మంత్రిగా భాద్యతలు స్వీకరించిన కేటీఆర్ ..డెంగ్యూ, మలేరియా వంటి  విష జ్వరాలు రాకుండా ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని చెప్పాడు. నీటితొట్టెలు, పూలకుండీలు, ఎయిర్‌కూలర్లలో నీరు నిల్వ ఉండకుండా చూడాలని సూచించారు, దోమల వ్యాప్తికి ఇదే ముఖ్య కారణమని కేటీఆర్ తెలిపారు. జీహెచ్ఎంసీ మేయర్, కమిషనర్ లోకేశ్ కుమార్‌తో పాటు ఉన్నతాధికారులు, కార్పొరేటర్లు  ప్రజల్లోకి వెళ్లి అవగాహన కల్పిస్తారని ఆయన అన్నారు. తాను కూడా ఇందులో భాగస్వామ్యం అవుతానని అన్నారు. నగరంలో చెత్త వేసే వెయ్యి ప్రాంతాలను గుర్తించామని, వాటిని యుద్ధప్రాతిపదికన తొలగిస్తామని అన్నారు.  అలాగే కేటీఆర్ తన ఇంటి పరిసరాలను శుభ్రం చేస్తున్న ఫొటోలను కూడా పోస్ట్ చేసారు. మీరు కూడా ఇంటి పరిసరాలను క్లీన్ చేసి ఆ ఫొటోలను తనతో పంచుకోవాలని పిలుపునిచ్చారు. ఆ ట్వీట్‌పై స్పందించిన ప్రభాస్.. కేటీఆర్ చేసిన పనిని మెచ్చుకున్నారు

ఈ విషయం లో మన సాహో మంత్రి కేటీఆర్ కి తన పూర్తి మద్దతు తెలిపాడు. కేటీఆర్ తన ఇంటి పరిసరాలను శుభ్రం చేస్తున్న ఫొటోలను ఫేస్‌బుక్ ద్వారా షేర్ చేసాడు  ప్రభాస్. డెంగ్యూ, విష జ్వరాలు రాకుండా ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని నగర  ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అందరూ క్షేమంగా ఉండాలని ఆకాంక్షించారు. కేటీఆర్ బాటలో నడిచి.. అందరూ ఇళ్లను పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలిపాడు. దీనిపై కేటీఆర్ కూడా స్పందించారు. ప్రభాస్ చేసిన ఆ ట్విట్ కి కేటీఆర్ కృతజ్నతలు తెలిపాడు. 


మరింత సమాచారం తెలుసుకోండి: