త్రివిక్రమ్ డైరెక్షన్ లో ప్రస్తుతం అల్లు అర్జున్ .అల .. వైకుంఠపురములో..నటిస్తున్నాడు. ఈచిత్రాన్ని సంక్రాంతి రేస్ లో నిలిపిన విషయం తెలిసిందే. అయితే జనవరి 10న రజినీకాంత్ నటిస్తున్న దర్బార్ , జనవరి 11 శనివారం రోజు మహేష్ బాబు నటిస్తున్న సరిలేరు నీకెవ్వరు విడుదలకానున్నడం తో పండగ సెలవులను క్యాష్ చేసుకునేందుకు అల వైకుంఠపురములో జనవరి 12న ఆదివారం థియేటర్లలోకి రావాల్సి వస్తుందట. అయితే ఈ రిలీజ్ డేట్ ఫై అధికారక ప్రకటన వెలుబడాల్సి వుంది.
ఇక సంక్రాంతి పండుగ కు రజినీకాంత్ , మహేష్ , అల్లు అర్జున్ తోపాటు కళ్యాణ్ రామ్ కూడా బరిలోకి దిగుతున్నాడు. ప్రస్తుతం కళ్యాణ్ రామ్ , సతీష్ వేగేశ్న డైరెక్షన్ లో ఎంత మంచివాడవురా అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈసినిమాను జనవరి 15న ప్రేక్షకులముందుకు తీసుకురానున్నారు. మరి ఈ నలుగురి లో ఎవరు సంక్రాంతి విన్నర్ గా నిలుస్తారో చూడాలి.