ప్రస్తుతం చిరంజీవి రాజకీయాలకు చాల దూరంగా ఉంటున్నా చిరంజీవి మళ్ళీ ఎదో ఒక పార్టీలో చేరి వచ్చే ఎన్నికలకు తిరిగి యాక్టివ్ అవుతాడు అంటూ ఊహాగానాలు వస్తూనే ఉన్నాయి. ఈ వార్తలను చిరంజీవి ఖండించక పోవడంతో మెగా స్టార్ మనసులో ఇంకా రాజకీయ ఆసక్తి కొనసాగుతూనే ఉంది అంటూ కామెంట్స్ వస్తున్నాయి. 

ఇలాంటి పరిస్థితులలో వచ్చేవారం విడుదలకాబోతున్న ‘సైరా’ చిరంజీవి జగన్ మోహన్ రెడ్డిలను పరోక్షంగా కలపబోతోందా అంటూ కామెంట్స్ వస్తున్నాయి. తెలుగు ప్రజలకు సంబంధించి మొట్టమొదటి స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ. అయితే ఇప్పటివరకు ఆయనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎటువంటి గుర్తింపును ఇవ్వలేదు. 

‘సైరా’ చిత్రం విడుదల అవుతున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది అన్న వార్తలు వస్తున్నాయి. చరిత్ర మరిచిపోయిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జయంతి వర్ధంతి కార్యక్రమాలను నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన అధికారిక నిర్ణయం త్వరలో ప్రకటిస్తారని అంటున్నారు. ‘గౌతమీ పుత్ర శాతకర్ణి’ సినిమాకు అప్పటి ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం వినోదపు పన్ను రాయితీ ఇచ్చి ఆ మూవీ నిర్మాతలను
ప్రోత్సహించింది. 

ఇప్పుడు అలాంటి ప్రోత్సాహం కూడ ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం ‘సైరా’ సినిమాకు ఇస్తుందా అన్న సందేహాలు కొందరికి కలుగుతున్నాయి. ఇది ఇలా ఉంటే చిరంజీవి ఈ మధ్య వైఎస్ఆర్ పార్టీ కీలక నేతతో భేటీ అయి ‘సైరా’ మూవీకి అదనపు షోలు వేసే విషయంలో అదేవిధంగా టిక్కెట్ రేటు పెంపు విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సహకారాన్ని కోరినట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం తాను రాజకీయాలకు పూర్తిగా దూరంలో ఉన్నానని తనకు ఏ రాజకీయ పార్టీతోను ఎటువంటి సాన్నిహిత్యం లేదనీ కేవలం తన సినిమాలు తప్ప మరే విషయం తాను పట్టించుకోవడం లేదనీ చిరంజీవి ఆ ప్రముఖ నాయకుడుతో అన్నట్లు సమాచారం..



మరింత సమాచారం తెలుసుకోండి: