మెగాస్టార్ అభిమానులు ఎంతో ఆసక్తి ఎదురు చూస్తున్న మూవీ ‘సైరా నరసింహారెడ్డి’ ట్రైలర్ వచ్చేసింది. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్‌పై రామ్ చరణ్ నిర్మిస్తున్న ఈ సినిమాకి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు.బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ అమిత్ త్రివేది సంగీతం సమకూర్చగా...రత్నవేలు సినిమాటోగ్రఫీ అందించారు. భారీ అంచనాల నడుమ ఈ చిత్రం వచ్చేనెల 2న గాంధీ జయంతి సందర్భంగా విడుదలకానుంది.

ఇప్పటికే విడులైన ట్రైలర్ యూట్యూబ్ లో ట్రెండ్ అవుతుంది. ఇప్పుడు 58 సెకన్ల నివిడి ఉన్న మరో ట్రైలర్‌ను విడుదల చేశారు.సినిమాలోని ప్రధానమైన యుద్ధ సన్నివేశాలను చూస్తుంటే బాహుబలిని తలపిస్తుంది ,ఆరు పదుల వయసులోనూ మెగా స్టార్ట్ చిరంజీవి చెప్పిన డైలాగుల్లో పవర్ తగ్గలేదు.

 ఈ ట్రైలర్ చూస్తుంటే వెండితెరపై నరసింహారెడ్డి సమరసింహపై ఆంగ్లేయులను చీల్చి చండాడటం చూస్తేంటే ప్రతి ప్రేక్షకుడి రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయి.‘‘ఇండియాని ఈజీగా దోచుకోవచ్చు. ట్యాక్స్‌లని 300 పర్సంట్ పెంచండి. బలగాలతో వెళ్లిన మన ఓడలన్నీ వాళ్ల బంగారంతో తిరిగిరావాలి’’ అని బ్రిటిష్ ఆఫీసర్ చెప్పే మాటలతో ట్రైలర్ మొదలైంది. చివరగా  ఉరికంభం ముందు నిలబడి "ఈ గడ్డ మీద పుట్టిన ప్రతి  ప్రాణానికి లక్ష్యం ఒక్కటే స్వతంత్రం స్వతంత్రం"  అంటూ నరసింహారెడ్డి గా చిరు చెప్పిన డైలాగ్ ట్రైలర్ కె హైలెట్ అని చెప్పాలి. మొత్తానికి ఈ ట్రైలర్ చూస్తున్న ప్రతి భారతీయుడు ఆ నాటి నరసింహరెడ్డి వీరత్వం ఏంటో తెలిసేలా రూపొందించారు. మొత్తం ఆంగ్లేయులపై రాయలసీమకు ముద్దు బిడ్డ ఉయ్యాల నరసింహారెడ్డి సమరాన్నే ఈ ట్రైలర్‌లో చూపించారు. 

ఈ రెండు ట్రైలర్సతో సినిమాపై అంచనాలను మరింత పెంచారు చిత్ర బృందం. రాయలసీమకు చెందిన మొట్టమొదటి స్వాతంత్య్ర సమరయోధుడు, రేనాటి సూరీడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డిగా చిరు విశ్వరూపాన్ని చూసిన మెగా అభిమానులు పండగ చేసుకుంటున్నారు.


    మరింత సమాచారం తెలుసుకోండి: