‘సైరా’ ప్రమోషన్ కోసం మీడియా ముందుకు వచ్చిన అమితాబ్ బచ్చన్ చిరంజీవి పవన్ ల రాజకీయ రంగప్రవేశం పై కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేసారు.  నిర్మాత దర్శకుడు ఫర్హాన్ అక్తర్ ‘సైరా’ ప్రమోషన్ కోసం ఒక ప్రముఖ హిందీ ఛానల్ కు నిర్వహించిన ఒక ఇంటర్వ్యూ కార్యక్రమంలో అమితాబ్ చిరంజీవితో కలిసి పాల్గొనడమే కాకుండా ఒకవైపు చిరంజీవి పై ప్రశంసలు కురిపిస్తూ మరొకవైపు చిరంజీవి రాజకీయాల విషయంలో తీసుకున్న తప్పుడు నిర్ణయాలను టార్గెట్ చేసాడు.  

తాను చిరంజీవికి అనేక విషయాలలో సలహాలు ఇస్తూ ఉంటానని అదేవిధంగా రాజకీయాలలోకి వెళ్ళద్దు అంటూ తాను సలహా ఇచ్చినప్పటికీ తన సలహా చిరంజీవి పాటించలేదు అంటూ తన అసంతృప్తి అమితాబ్ వ్యక్త పరిచాడు. అంతేకాదు ఇలాంటి సలహా తాను పవన్ కళ్యాణ్ కు కూడ ఇమ్మని తాను చిరంజీవి ద్వారా ప్రయత్నాలు చేసినా పవన్ కూడ తన మాటలు లెక్క చేయలేదు అంటూ షాకింగ్ కామెంట్స్ చేసాడు. 

ఇదే సందర్భంలో గతంలో తాను ‘హమ్’ అనే మూవీ షూటింగ్ కోసం ఊటీలో ఉన్నప్పుడు తన షూటింగ్ స్పాట్ కు దగ్గరలో చిరంజీవి మూవీ షూటింగ్ జరుగుతున్న విషయాలను తెలుసుకుని అక్కడకు వెళ్ళి చిరంజీవిని కలిసిన అప్పటి సంగతులను గుర్తుకు చేసుకున్నాడు. తనతో చాలాసేపు సరదాగా మాట్లాడిన చిరంజీవి షాట్ రెడీ అని చెప్పగానే అక్కడకు వెళ్లి చాల కష్టమైన డాన్స్ మూమెంట్ ను కేవలం కొన్ని నిముషాలలో సింగిల్ టెక్ లో ఓకె చేయించుకు వచ్చిన చిరంజీవి ప్రతిభ పై అమితాబ్ ప్రశంసలు కురిపించాడు. 

అంతేకాదు ఆ డాన్స్ మూమెంట్ ను తాను అనుసరిద్దామని ఆతరువాత ప్రయత్నిస్తే చిరంజీవిలా చేయడానికి తాను 6 నెలలు ప్రాక్టీసు చేయవలసిన పరిస్థితి వచ్చింది అంటూ జోక్ చేసాడు. ‘సైరా’ ప్రమోషన్ లో ఒకవైపు చిరంజీవి మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తూ రజినీకాంత్ కమలహాసన్ లు రాజకీయాలకు పనికిరారు అంటూ చిరంజీవి సూచనలు ఇస్తుంటే ఇప్పుడు చిరంజీవి పవన్ లు రాజకీయాలకు పనికిరారు అంటూ ఒకప్పుడు రాజకీయాలలోకి వెళ్ళి ఫెయిల్ అయిన అమితాబ్ సూచనలు ఇవ్వడం యాధృశ్చికం అనుకోవాలి..


మరింత సమాచారం తెలుసుకోండి: