కొత్త వాళ్ళను సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేయడంలో పూరికి మంచి పేరు ఉన్నది. అయన పరిచయం చేసిన చాలామంది హీరోయిన్లు ఇప్పుడు టాప్ హీరోయిన్లుగా చలామణి అవుతున్నారు. రక్షిత ఒకప్పుడు టాప్ హీరోయిన్ గా మెప్పించింది. అనుష్కను సూపర్ సినిమాతో పరిచయం చేశాడు. ఇప్పుడు అనుష్క టాలీవుడ్ లో టాప్ హీరోయిన్. అరుంధతి, బాహుబలి సినిమాతో మరో స్థాయికి వెళ్ళిపోయింది. వీరితో పాటు ఎందరినో సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేశారు.
కాగా ఇప్పుడు మరో కొత్త హీరోయిన్ ను టాలీవుడ్ కు పరిచయం చేయబోతున్నాడు పూరి. ఆమెకు టాలీవుడ్ లో ఇదే మొదటి సినిమా కానీ, సోషల్ మీడియాను బాగా ఫాలో అయ్యేవాళ్ళకు ఆమెకు మంచి పరిచయం ఉంది. నిత్యం హాట్ హాట్ ఫొటోలతో కేకపుట్టిస్తుంది. మోడల్ గా ఇప్పటికే రాణించిన కేతిక శర్మను సినిమా రంగంలోకి ఇంట్రడ్యూస్ చేస్తున్నారు పూరి. పూరి కొడుకు ఆకాష్ ను హీరోగా, కేతిక హీరోయిన్ గా రొమాంటిక్ అనే సినిమాను ప్లాన్ చేశారు.
ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ ను ఈరోజు రిలీజ్ చేయబోతున్నారు. పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరి కనెక్ట్ ప్రొడక్షన్స్ లో పూరి, ఛార్మిలు సంయుక్తంగా సినిమాను నిర్మిస్తున్నారు. అనిల్ అనే కొత్త దర్శకుడు ఈ మూవీతో పరిచయం కాబోతున్నారు. ఇందులో సినిమా టైటిల్ అంత రొమాంటిక్ గా ఉంటె.. సినిమా ఇంకెంత రొమాంటిక్ గా ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు. అయితే, సినిమా ఎలా ఉండబోతుంది అనే విషయాలు పక్కన పెడితే..
ఈ సినిమాలో నటించే హీరోయిన్ సినిమాల్లో యాక్ట్ చేయకముందే అంత హాట్ గా ఉన్నది అంటే.. సినిమాల్లోకి వచ్చిన తరువాత ఇంకెంత హాట్ గా ఉంటుందో చెప్పక్కర్లేదు. ప్రస్తుతం కేతిక శర్మకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో బాగా సెర్చ్ అవుతున్నాయి. ఆమెకు సంబంధించిన విషయాలను తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు యువకులు. పూరి స్కూక్ నుంచి రాబోతున్న హీరోయిన్ కాబట్టి ఇండస్ట్రీలో ఏ మేరకు రాణిస్తుందో చూడాలి.