సెంటిమెంట్స్ అనేవి అందరికి ఉంటాయి.....అది సహజం. ఇక సినిమా ఇండస్ట్రీలో ఐతే కొత్తగా చెప్పనక్కర్లేదు. రాత్రికి రాత్రే తలరాతలు మార్చే సినిమా కోసం దర్శకనిర్మాతలు సెంటిమెంట్స్‌కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటారు. కొందరు రిలీజ్ డేట్స్ కి ముహుర్తాలు చూస్తే, మరికొందరు టైటిళ్ల విషయంలో జాగ్రత్త పడతారు. పిల్లలకి పేరు పెట్టేటపుడు ఎంత జాగ్రత్త పడతారో అంతే జాగ్రత్తలు తీసుకుంటారు సినిమా టైటిల్ విషయంలో. 

అయితే తాజాగా అల్లు అర్జున్ కొత్తసినిమా 'అల.. వైకుంఠపురములో' టైటిల్‌ విషయంలో అలాంటి సెంటిమెంట్ ని ఫాలో అవుతున్నాడు.ఈ మూవీ టైటిల్ విషయంలో చేసిన చిన్న మార్పు జనాల్లో చర్చనీయాంశంగా మారింది. గత కొంతకాలంగా సరైన హిట్ లేక సతమతమవుతున్న బన్నీ ఈ సినిమాతో ఎలాగైనా విజయం సాధించాలని పట్టుదలగా ఉన్నాడు. ఈ నేపథ్యంలోనే జ్యోతిష్యుల సలహా మేరకు సెంటిమెంట్‌కి పాధాన్యత ఇస్తూ 'అల.. వైకుంఠపురములో' టైటిల్‌లో స్వల్ప మార్పు చేశారని తెలుస్తోంది. మార్పులు అంటే టైటిల్ ని ఏ మాత్రం మార్చలేదు. కేవలం ఒకే ఒక అక్షరం జోడించాడు. అది కూడా ఇంగ్లీష్ లో. దాని వాళ్ళ టైటిల్ లో మార్పు పెద్దగా లేదు. 

అది ఏంటి అంటే ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేసినపుడు 'అల.. వైకుంఠపురములో' ఇంగ్లీష్ టైటిల్‌లో ఒకే ఒక్క 'ఆర్' అనే అక్షరం ఉండేది. కానీ సామజవరగమన సాంగ్ రిలీజ్ సమయంలో దానికి మరో 'ఆర్' అనే అక్షరాన్ని జోడించారు మేకర్స్. దీంతో ఇలా చేస్తే మాత్రం ఆ ఒక్క లెటర్ బన్నీ ఫేట్ ని మార్చేస్తుందా? అనుకుంటున్నారు ప్రేక్షకులు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కాంబోలో తెరకెక్కుతోంది3వ సినిమా 'అల.. వైకుంఠపురములో'.

 గీతా ఆర్ట్స్ బ్యానర్‌, హారిక & హాసిని క్రియేషన్స్ సంయుక్త సమర్పణలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. చిత్రంలో అల్లు అర్జున్‌ సరసన పూజాహెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. సుశాంత్, నివేదా పేతురాజ్, టబు కీలక పాత్రలు పోషిస్తున్నఈ సినిమాపై ఇటు త్రివిక్రమ్ అభిమానులు, అటు అల్లు అర్జున్ ఫ్యాన్స్ చాల ఆశలు పెట్టుకున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ సినిమా విడుదల కానుంది.


    మరింత సమాచారం తెలుసుకోండి: