ఒక్కో ఒక్కోసారి బాక్సాఫీస్ దగ్గర సరైన హిట్ ఫలితాలు కొట్టపైన సినిమాలు టీవీల్లో హిట్ అవుతూ ఉంటాయి. గతంలో హీరో పవన్ కళ్యాణ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన ‘అజ్ఞాతవాసి’ అందరి అంచనాలను తగ్గిస్తూ  తలకిందులు చేస్తూ బాక్సాఫీస్ దగ్గర పెద్ద డిజాస్టర్‌గా నిలిచింది.

మరి ఇపుడు మాత్రం  ‘అజ్ఞాతవాసి’ సినిమా మాత్రం  ఇప్పుడు సరి కొత్త రికార్డులకు శ్రీకారం చుడుతోంది. ఎప్పుడో విడుదలైన సినిమా ఇప్పుడు రికార్డ్ లు సృష్టించడం ఏమిటి అని  అనుకుంటున్నారా ? ‘అజ్ఞాతవాసి’ చిత్రాన్ని హిందీ భాషలోకి దబింగ్  చేసి విడుదల చేసిన సంగతి  అందరికి తెలిసిందే కదా..

కాగా  హిందీలో ‘అజ్ఞాతవాసి’ హిందీ వెర్షన్ గత ఏడాది అక్టోబర్‌ లో యూట్యూబ్‌ లో ప్రవేశ పెట్టారు. అయితే తాజాగా ఈ చిత్రం 100 మిలియన్ల వ్యూస్ ను సాధించి సరి కొత్త రికార్డ్ ని సూష్టించింది.‘అజ్ఞాతవాసి’ హిందీ వెర్షన్ కి  ప్రముఖ టాలీవుడ్ చిత్రాల ప్రముఖ డిజిటల్ పంపిణీదారు అయిన గోల్డ్‌మైన్స్ టెలిఫిల్మ్స్ యొక్క అధికారిక యూట్యూబ్ ఛానెల్‌ లో 4.6 లక్షలకు పైబడి  లైక్‌ లు వచ్చాయి. లైక్ లతో పాటు 100 మిలియన్ వ్యూస్ రావడంతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఫుల్ జోషులో హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అని తెలుస్తుంది.

 అంతేకాదు ఈ మూవీని కొన్న బయ్యర్స్‌కు కూడా చాలా  భారీ నష్టాలను తీసుకొనివచ్చింది. అంతేకాదు దేశవ్యాప్తంగా బిగ్గెస్ట్ డిజాస్టర్స్‌లో మూడో స్థానంలో ఉంది. 
బాక్సాఫీస్ దగ్గర సరైన ఫలితాన్ని లభించిన ,అజ్ఞాతవాసి’ మూవీ ఆన్ లైన్‌లో మాత్రం భారీ రికార్డులను సాధిస్తుంది. ఇటీవల తెలుగులో పెద్దా, చిన్నా అనే తేడా లేకుండా అన్ని సినిమాలను హిందీలో డబ్ చేస్తూ రిలీజ్ చేస్తున్నారు అని అందరికి తెలిసిందే.రీసెంట్గా పవన్ కళ్యాన్ నటించిన ‘అజ్ఞాతవాసి’ మూవీని హిందీలో ‘ఎవడు 3’ పేరుతో డబ్ చేసి రిలీజ్  చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: