ప్రపంచ వ్యాప్తంగా మెగా అభిమానులతో పాటుగా యావత్ సినీ ఇండస్ట్రీ మొత్తం ఎదురు చుసిన సినిమా సైరా. ఈరోజు థియేటర్లలో సందడి చేసింది. చిరంజీవి నటించిన భారీ బడ్జెట్ సినిమాగా రూపొందించిన ఈ సినిమా ఉయ్యాలవాడ నరసింహరెడ్డి అయినా స్వాతంత్ర్య సమరయోధుడు అయినా ఈయన జీవితాన్ని ఆధారంగా చేసుకొని ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాను స్వయంగా మెగా వారసుడు రామ్ చరణ్ ఈ సినిమాను నిర్మించారు. 


ఈ సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. ఈయనకు ఇది రెండొవ సినిమా.. ఇలా చరిత్రను తలపించేలా సినిమాను ఎక్కడ తీయలేదు.. ఆ దాఖలు కూడా లేవు.. మరి చిరంజీవి ఎందుకు ఇతనిని డైరెక్టర్ గా ఎంచుకున్నారో ఎవరికీ అర్థం కావడంలేదు. జక్కన్న లాంటి దర్శకదీరుడు ఈ సినిమానుకు దర్శకత్వం వహించి ఉంటే సినిమా పరిస్థితి మనం ఊహించని విదంగా ఉండేదేమో.. 
తెలుగులో ఓ సామెత ఉంది అదేంటంటే.. దెబ్బ పడితే కానీ, అబ్బ గుర్తుకురాడు  అని..


ప్రస్తుతం సైరా పరిస్థితి కూడా అలానే మారింది. యావత్ సినీ జనాలను ఎదో కొంచం కొంచం చూపుంచి ఊరించిన సైరా ఇప్పుడు మొత్తం చూపించింది. అయినా కూడా సినీ ప్రేక్షకులకు కావలసిని రుచిని కలిగించలేక పోయింది. భారీ బడ్జెట్ సినిమాలు అంటే ఒక్క రాజమౌళికి అంకితం. అయన మార్క్ సినిమాలపై పెట్టి ఎదో మాయ చేసి హిట్ అయ్యేలా చేయడమే కాదు ప్రపంచ రికార్డులను కూడా దక్కించుకుంటాయి. 



ప్రస్తుతం సైరా విషయం చుస్తే బాక్సాఫీస్ రికార్డులు కాదు గాని, రామ్ చరణ్  రోడ్డున పెడతాడేమో అన్న విదంగా పబ్లిక్ టాక్ వినపడుతుంది.చిరంజీవి యాక్టింగ్ సూపర్ అయినా ప్రయోజనమేముంది.. ఎందరో సీనియర్ నటులు నటించిన కూడా ఈ సినిమా హిట్ టాక్ అందుకోలేక పోవడం నిజంగా వర్ణనాతీతం. అలనాటి బ్రిటిష్ పాలనను చూపించిన కూడా, దేశ భక్తి ని అందించిన కూడా ఈ సినిమా మాత్రం బాహుబలి స్థాయిని అందుకోలేపోయింది. నిన్నటి వరకు సినిమా పై మెగా అభిమానులతో పాటుగా సినీ ఇండస్ట్రీలో కూడా ఈ సినిమా పై భారీ అంచనాలున్నాయి. సినిమా హిట్ అవుతుంది అని అందరు అనుకున్నారు. క్రిటిక్స్ కూడా ఓకే ఓకే అన్నట్లు ఉంది. ఎటు చుసిన ఓకే అనే టాక్ వినపడుతుంది. కలెక్షన్స్ మాత్రం అనుకున్నంతగా రాకుంటే సినిమా పరిస్థితి గోవిందా అంటున్నారు. ఫస్ట్ షో కె బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా బోల్తా కొట్టిందని అర్థమవుతుంది... 


మరింత సమాచారం తెలుసుకోండి: