సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ వేదికగా జరిగిన ఓ కార్యక్రమంలో మన తెలుగు సినిమా దర్శక, నిర్మాతలకు తెలుగు నటులు అంటే చాలా చులకనగా ఉందని... వారు తెలుగు నటీనటులను తమ సినిమాల్లో పెట్టుకునేందుకు చాలా నామోషీగా ఫీలవుతున్నారని... వాళ్లకు పొరుగింటి పుల్లకూర రుచి అన్న తీవ్ర ఆవేదనతో తన బాధనంతా వెళ్లగక్కారు. గత కొన్ని దశాబ్దాల నుంచి చూస్తే తెలుగు సినిమా నటీనటులు అందరూ ఇతర భాషల నటీనటులకు ఎంతో ఆదర్శంగా ఉండేవారు. కోట శ్రీనివాసరావు ఎన్నో విలక్షణ పాత్రలతో... ఎన్నో వైవిధ్యమైన విలన్ రోల్స్ తో దక్షిణ భారతదేశ సినీ పరిశ్రమ మొత్తం ఆకట్టుకున్నారు.


ఇక ఈ జనరేషన్లో కూడా తెలుగులో పేరున ఉన్న వారిని కాదని మన దర్శక నిర్మాతలు తమిళనాడుకు చెందిన వాళ్లను... లేదా బాలీవుడ్ కి చెందిన వాళ్ళు మాత్రమే విల‌న్లుగా తీసుకుంటున్నారు. దీంతో ఎంతో ప్రావీణ్యం ఉన్న తెలుగు వాళ్లకు అవకాశాలు రావడం లేదు. ఇక ఇప్పుడు కొత్తగా కాస్త డబ్బులు ఎక్కువగా ఖర్చు పెడుతూ.. పాన్‌ ఇండియా సినిమా అంటూ ఓ ముద్దు పెట్టుకొని ఇతర భాషలకు చెందిన నటీనటులను తీసుకుని నాలుగు భాషల్లో ఒకేసారి సినిమాలు రిలీజ్ చేస్తూ కోట్లు దండుకోవడం అన్న కొత్త తరహా ఐడియాకు తెరలేపారు.


ఇటీవల వచ్చిన రెండు భారీ బడ్జెట్ సినిమాల్లో సైరా, సాహో చూస్తే ఈ విషయం స్పష్టంగా తెలుస్తుంది. ఈ రెండు సినిమాల కాన్సెఫ్ట్ ఒక్క‌టే. నాలుగైదు భాష‌ల్లో రిలీజ్ చేద్దాం... అందుకే అక్క‌డ పేరున్న న‌టీన‌టుల‌ను ఇక్క‌డ దింపేద్దాం. సాహ‌లో అంద‌రూ బాలీవుడ్ విల‌న్లే ఉన్నారు. ఇక సైరా కోసం ఏకంగా బాలీవుడ్ బిగ్ బీ అమితాబ‌చ్చ‌న్‌నే ఒప్పించారు. వీళ్లంతా ఆ సినిమాల్లో ఉండ‌డంతో మ‌న తెలుగు ప్రేక్ష‌కులు వాటిని తెలుగు సినిమాల్లా ఫీల్ అవ్వ‌లేదు.


పైగా వారికోసం సినిమాల్లో తెలుగు నేటివిటీ మిస్ అయ్యేలా చేశారు. సాహో అయితే పూర్తిగా బాలీవుడ్ మూవీలా ఉండగా, సైరాలో అయితే ఆయా బాషల నటీనటుల వచ్చే సీన్లలో వారి నేటివిటీ తెలిసేలా తీశారు.  దీని వల్ల సినిమా అసలు కథ దెబ్బతింది. మొత్తం మీద ఇతర బాషల్లో మార్కెట్ పెంచుకోవడం కోసం....సినిమాల్లో పరబాషా నటీనటులని ఇరికించడం వల్ల సాహో, సైరా సినిమాల ఫ‌లితం విష‌యంలో మొద‌టికే మోసం వ‌చ్చేసింది. దీంతో ఇవి డ‌బ్బింగ్ సినిమాల‌న్న‌ట్టుగా మారిపోయాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: