సైరా  విడుదలైన  అటు మూవీ క్రిటిక్స్, ఇటు సాధారణ ప్రేక్షకుల నుండి అద్బుతమమైన స్పందన అందుకొంటుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ చిరు నివాసంలో కలిసి విజయాన్ని జరుపుకోవడం జరిగింది. అయితే సినిమా విడుదలకి ముందు చిరంజీవి కొన్ని ఆసక్తికరమైన కామెంట్స్ చేసారు. సైరా సినిమా ప్రమోషన్ లో భాగంగా చిరంజీవి మాట్లాడుతూ... నాకు స్వాతంత్య్ర సమరయోధుడు పాత్ర చేయాలనుందని దాదాపుగా ఒకటిన్నర దశాబ్దం, ఒక పుష్కరకాలం మించి నా మదిలో మెదులుతోంది చెప్పుకుంటూ వస్తున్నాను. 



ముఖ్యంగా భగత్ సింగ్ పాత్ర చేయాలని ఉండేది.కానీ అలాంటి కథతో దర్శక నిర్మాతలు నా ముందుకు ఎవరు రాలేదని చిరు అన్నారు. ఆ కోరిక , ఆ కల అలానే ఉండిపోయింది. కానీ, ఈ సినిమాతో ఆ కోరిక తీర్చుకున్నా’’ అని చిరంజీవి చెప్పారు.ఇక ఆ పాత్ర చేయలేననే ఫీలింగ్ కలుగుతోందని.....ఇక ఇదే తరుణంలో తనకు మరో డ్రీమ్ రోల్ ఉందని చెప్పారు. 
భగత్ సింగ్ పాత్రలో నటించాలని తనకు ఎప్పటినుంచో ఆసక్తి ఉందని.. అయితే అలాంటి పాత్రలు చేయలేకపోవచ్చని అన్నారు. 

కానీ తాను చేయాలనుకున్న భగత్ సింగ్ పాత్రను రామ్ చరణ్ చేస్తే చూడాలని ఆశగా ఉందని చిరంజీవి తన మనసులోని మాటను చెప్పుకొచ్చాడు.  పనిలో పనిగా తన డ్రీం ప్రాజెక్ట్ లో నటించే బాధ్యత చిరు కొడుకు చరణ్ కి అప్పగించాడని సినీ జనాలు అనుకుంటున్నారు.


మరోవైపు ‘సైరా’ సినిమా గురించి మాట్లాడితే.. ఈ చిత్రాన్ని దర్శకుడు సురేందర్ రెడ్డి అద్భుతంగా తీర్చిదిద్దాడని చెప్పొచ్చు. తన తండ్రి కల నెరవేర్చడానికి రామ్ చరణ్ పడిన కృషి అమోఘం. ‘బాహుబలి’ సిరీస్ తర్వాత ‘సైరా’తో చిరంజీవి, రామ్ చరణ్‌లు తెలుగు సినిమా ఖ్యాతిని, గొప్పతనాన్ని మరోసారి ప్రపంచానికి చాటి చెప్పారనడంలో ఎలాంటి సందేహం లేదు.



మరింత సమాచారం తెలుసుకోండి: