సినీ జీవితానికి ముగింపు పలుకుతూ పెళ్లికి సిద్ధమైంది ఒకప్పటి హాట్ హీరోయిన్ అర్చన.  అర్చనకి వ్యాపారవేత్త ప్రముఖ హెల్త్‌కేర్ కంపెనీ వైస్ ప్రెసిడెంట్‌ అయిన జగదీష్ అనే వ్యక్తితో నేడు  హైదరాబాద్ లో నిశ్చితార్థం జరిగింది.గత నెలలోనే ప్రియుడు జగదీశ్‌తో కలిసి దిగిన   ఫోటోలను  ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసిన తాను ప్రేమలో ఉన్నానని చెప్పకనే చెప్పింది అర్చన.  ‘‘త్వరలో మీకు ఒక గొప్ప న్యూస్ చెప్పబోతున్నాను. అప్పటి వరకు ఈ మూమెంట్స్ ఎంజాయ్ చేయాలనుకుంటున్నాను.


గత కొద్దికాలంగా ప్రేమలో ఉన్న ఈ జంట నిశ్చితార్థ వేడుకకు సీనీ ప్రముఖులు హాజరయ్యారు.  అక్టోబర్ 3న బంజారా హిల్స్‌లోని రాడిసన్ బ్లూ హోటల్లో వీళ్ళ ఎంగేజ్‌మెంట్ జరిగింది. అత్యంత సన్నిహితులు, స్నేహితులు మధ్య ప్రైవేట్‌గా జరిగిన అర్చన నిశ్చితార్థ వేడుకకు  బిగ్ బాస్ హౌస్ మిత్రులు ప్రత్యక్షమయ్యారు.బిగ్ బాస్ మొదటి సీజన్ విన్నర్ శివబాలాజీ , ఆయన తన సతీమణి మధుమితతో కలిసి ఈ ఈవెంట్ కు విచ్చేశాడు.టాలీవుడ్ యంగ్ యాక్టర్, అక్కినేని హీరో సుమంత్ ఈ వేడుకకు హాజరై.. అర్చనకు అభినందనలు తెలిపారు.

అనంతరం ఫోటోలు దిగి సోషల్ మీడియాలో షేర్ చేశారు. అర్చన తల్లిదండ్రులైన విజయ శాస్త్రి, సుధాకర్ శాస్త్రి.. జగదీష్ తల్లిదండ్రులు ప్రతిభ, భక్తవత్సలం కాబోయే దంపతులను ఆశీర్వదించారు. తన అందంతో కుర్రకారు హీటెక్కించిన ఈ భామ ప్రస్తుతం సినిమాలకు దూరంగానే ఉంటుంది. 



బిగ్ బాస్ మొదటి సీజన్లో పాల్గొని వార్తల్లో నిల్చింది. అయితే బిగ్ బాస్ షో-1 తెచ్చిన ఫేమ్ ఆమె సినీ జీవితానికి అంతగా ఉపయోగపడలేదు. తాజాగా సప్తగిరి హీరోగా నటించిన వజ్రకవచధార గోవిందా అనే చిత్రంలో ఓ పవర్‌ఫుల్ పాత్రను పోషించింది అర్చన. 2004లో అల్లరి నరేష్  హీరోగా వచ్చిన 'నేను' సినిమాతో తెరంగేట్రం చేసిన అర్చన.. తెలుగుతో పాటు కన్నడ,తమిళంలోనూ సినిమాలు చేసింది. 



మరింత సమాచారం తెలుసుకోండి: