ప్రస్తుత సూపర్ ఫామ్ లో ఉన్న హీరో బెల్లంకొండ శ్రీనివాస్ అలియాస్ అల్లుడు శీను మొదటి సినిమాతోనే ఒక యాక్టర్ గా ప్రూఫ్ చేసుకొని హిట్ కోసం వెంపర్లాడాడు మొత్తానికి మొన్న రాక్షసుడు మూవీ తో సూపర్ హిట్ కొట్టి టాలీవుడ్ లో తన ఉనికి చాటుకున్నారు.అలానే  బెల్లంకొండ సురేష్ ప్రముఖ నిర్మాత "తనయుడి"గా పేరుకోసం,హిట్ కోసం పడిన  తపన అంతా ఇంతా కాదు.ఇప్పుడు రెండవ తనయుడు అయిన గణేష్ ని తొలిపరిచయం చేస్తూ ఒక సినిమా తీసేందుకు సమాయత్తం అయ్యారు.

అయితే మాస్ ప్రేక్షకులను పొందడానికి శ్రీను చేసిన కష్టాన్ని చూసిన సురేష్ తన రెండవ కుమారుడిని మాస్ సినిమా తో కాకుండా ఒక అందమైన ప్రేమ కథ తో తెరకు పరిచయం చేయనున్నారు బెల్లంకొండ సురేష్,శ్రీను.ప్రస్తుతం శ్రీను కి వస్తున్న అభినందనలు,చేస్తున్న సినిమాలు పొందిన అభిమానులు దృష్టిలో పెట్టుకొని గణేష్ సినిమాని ప్లాన్ చేస్తున్నట్టు విశ్వసనీయ వర్గాల నుండి వస్తున్న సమాచారం.అయితే గణేష్ బెల్లంకొండ హీరో గా చేస్తున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత,నిర్మాణ సంస్థ కు చెందిన పవన్ సాధినేని తెరకెక్కిస్తుండగా.. లక్కీ మీడియా, బెటెల్ లీఫ్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తోంది.

ఈ సినిమాతో నిర్మాతల కుటుంబానికి చెందిన రామానాయుడు తనయులకంటే ఇంకా గొప్పగా తమ కుటుంబం సినిమా ఇండస్ట్రీ లో నిలవాలి అని ఎంతో కృషి చేస్తున్నారు బెల్లంకొండ సురేష్.మరో పక్క అన్నవేసిన బాటలో తమ్ముడు కూడా వెళ్లేందుకు బాడీని షేప్ చేసుకొనే దెగ్గర నుండి డాన్స్ విషయంలో కానీ యాక్టింగ్ విషయంలో గాని ప్రతి విషయంలో చాలా చాలా జాగ్రత్తలు తీసుకుంటూ హిట్ వ్యూహాన్ని రచిస్తున్నారు బెల్లంకొండ కుటుంబీకులు. గణేష్ కూడా సక్సెస్ అయితే ఒక తండ్రి గా తన కోరిక నెరవేరినట్టే అని బెల్లంకొండ సురేష్ ఆశపడుతున్నారు. గణేష్ కూడా హిట్ కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం.


మరింత సమాచారం తెలుసుకోండి: