2019 సంవత్సరంలో అత్యంత భారీ బడ్జెట్లతో తెరకెక్కిన సినిమాల్లో సాహో మొదటి స్థానంలో ఉండగా సైరా నరసింహారెడ్డి రెండో స్థానంలో ఉంది. విడుదలకు ముందు ఈ రెండు సినిమాలపై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. కానీ రిలీజైన తరువాత ఈ రెండు సినిమాలు అంచనాలు అందుకోవటంలో ఫెయిల్ అయ్యాయి. సాహోకు ప్రేక్షకుల నుండి నెగిటివ్ టాక్ వచ్చినప్పటికీ సాహో బాలీవుడ్ లో హిట్ అనిపించుకుంది. 
 
సైరా నరసింహా రెడ్డి సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే పరవాలేదనిపించే విధంగా కలెక్షన్లు వస్తున్నాయి. మిగతా అన్ని చోట్ల ఈ సినిమాకు నష్టాలు తప్పటం లేదు. ఓవర్సీస్ లో కూడా కలెక్షన్లలో భారీగా డ్రాప్ కనిపిస్తోందని తెలుస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో 120 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన సైరా సినిమా 5 రోజుల్లో 70 కోట్ల రూపాయల షేర్ తెచ్చుకుంది. సినిమా హిట్ అనిపించుకోవాలంటే మరో 50 కోట్ల రూపాయల షేర్ వసూలు చేయాల్సి ఉంది. 
 
దసరా సెలవులు మరో రెండు రోజులు మాత్రమే ఉండటంతో ఈ రెండు రోజుల్లో సైరా భారీగా కలెక్షన్లను రాబట్టాల్సి ఉంది. కానీ సైరా సినిమా కలెక్షన్లు రోజురోజుకు తగ్గుముఖం పడుతూ ఉండటంతో సైరా డిస్ట్రిబ్యూటర్లు టెన్షన్లో ఉన్నారని తెలుస్తోంది. సినిమాపై భారీగా అంచనాలు ఉండటంతో భారీ మొత్తాలకు సినిమా రైట్స్ కొనుక్కున్నారు. ఇప్పుడు సైరా సినిమా బ్రేక్ ఇవెన్ అవుతుందా లేదా అని టెన్షన్లో ఉన్నారని తెలుస్తోంది. 
 
మొదటిరోజు రికార్డు స్థాయి కలెక్షన్లు రాబట్టిన సైరా నరసింహా రెడ్డి సినిమా కలెక్షన్లు రెండో రోజు నుండే డ్రాప్ అయ్యాయి. సైరా సినిమాతో పాటు విడుదలైన వార్ సినిమా కలెక్షన్లు కూడా తగ్గుముఖం పట్టాయని తెలుస్తోంది. శనివారం రోజు విడుదలైన చాణక్య సినిమాకు యావరేజ్ టాక్ రావటంతో సైరా సినిమాకు పోటీనిచ్చే సినిమా లేకపోవటం మాత్రం కలిసొచ్చే అంశంగా చెప్పవచ్చు. 



మరింత సమాచారం తెలుసుకోండి: