‘సైరా’ చిరంజీవి రామ్ చరణ్ లు కోరుకున్న రికార్డులను ఇవ్వలేకపోయినా ఈ మూవీ తమన్నాకు అదృష్టంగా మారింది. ‘ఎఫ్ 2’ తరువాత ఒక్క సక్సస్ అదేవిధంగా చెప్పుకోతగ్గ ఒక్క అవకాశం కూడ తెచ్చుకోలేని తమన్నాకు ‘సైరా’ ఒక అదృష్ట దేవత. ఈ మూవీలో తమన్నా పాత్రకు మంచి ప్రశంసలు రావడమే కాకుండా ఈ మూవీ ప్రమోషన్స్ విషయంలో నయనతార చూపించిన సహాయ నిరాకరణ తమన్నాకు ఊహించని అదృష్టాన్ని ఇచ్చింది.

చిరంజీవితో పాటు దేశ వ్యాప్తంగా ఈ మూవీ ప్రమోషన్ కు సంబంధించిన ప్రతి కార్యక్రమంలోను తమన్నా కనిపించడమే కాకుండా చరణ్ తో ఆమె అతి సన్నిహితంగా ఉంటూ చరణ్ ను ఏక వచనంతో పిలిచిన సందర్భాలు కూడ చాలామందికి షాక్ ఇచ్చాయి. ఇప్పుడు ఏకంగా తమన్నా మాట తీరు మెచ్చి ఉపాసన తమన్నాకు ఇచ్చిన 2 కోట్ల విలువైన డైమండ్ రింగ్ పై ఇండస్ట్రీ వర్గాలలో ఆసక్తికర చర్చలు జరగడమే కాకుండా రామ్ చరణ్ ఉపాసనలతో తమన్నా సాన్నిహిత్యం కూడా చర్చనీయాంశంగా మారింది. 

వాస్తవానికి ఈ సినిమాలో నటించినందుకు తమన్నాకు చాల తక్కువ పారితోషికం ఇచ్చారు అని అంటారు. దీనితో తమన్నా ‘సైరా’ అందించిన సహకారానికి కృతజ్ఞతగా ఇంత విలువైన రింగ్ ఇచ్చారా అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. 

అయితే మెగా ఫ్యామిలీ డబ్బు విషయంలో చాల గట్టిగా ఉంటుంది అన్నది ఇండస్ట్రీ ఓపెన్ సీక్రెట్. ఇలాంటి పరిస్థితులలో కేవలం ‘సైరా’ ప్రమోషన్స్ కు వచ్చి సహకరించినందుకు కాను ఇంత విలువైన గిఫ్ట్ ఇస్తారా అంటూ మరికొందరు షాక్ అవుతున్నారు. ఈ గిఫ్ట్ గురించి న్యూస్ ను అధికారికంగా తెలపడమే కాకుండా ఉపాసన ఇచ్చిన రింగ్ ఫోటోను తమన్నా సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఇప్పటి వరకు గాసిప్పులుగా కొనసాగిన ఈ న్యూస్ అధికారిక సమాచారంగా మారింది.. 


మరింత సమాచారం తెలుసుకోండి: