‘రంగస్థలం’ లాంటి సూపర్ హిట్ ఇచ్చిన సుకుమార్ చాలకాలం మహేష్ పిలుపు కోసం ఎదురు చూసి విసిగిపోయి అల్లు అర్జున్ వైపు చూస్తున్నా ఇంకా బన్ని సుకుమార్ ను పూర్తిగా కనికరించడంచలేదు. సుకుమార్ బన్నీల మూవీ గతవారం వచ్చిన విజయదశమి రోజున ప్రారంభం అవుతుమదని చివరివరకు లీకులు వచ్చి చివరకు చడీచప్పుడు లేకుండా సుకుమార్ కు దసరా పండుగ గడిచిపోయింది. 

సుకుమార్ బన్నీ కోసం తయారుచేసిన కథకు సంబంధించిన స్క్రీన్ ప్లేలో ఇంటర్వైల్ తరువాత పార్ట్ బన్నీకి నచ్చకపోవడంతో మళ్ళీ ఈ కధలో మార్పులు జరుగుతున్నట్లు సమాచారం. దీనితో అసలు సుకుమార్ బన్నీతో చేయబోయే సినిమా ఉంటుందా లేదా అన్న సందేహాలు కలుగు తున్నాయి. 

ఇలాంటి పరిస్థితులలో చిరంజీవి చేయబోయే 153వ సినిమాకు సుకుమార్ దర్శకుడిగా ఎంపిక అయ్యాడు అంటూ వస్తున్న వార్తలు షాకింగ్ గా మారాయి. రామ్ చరణ్  ఈమధ్య మళయాళ సూపర్ హిట్ మూవీ `లూసిఫర్` రైట్స్ కొనుక్కుని ఆ మూవీని తెలుగులో చిరంజీవి 153వ సినిమాగా తీయడానికి అప్పుడే ప్రయత్నాలు కూడ మొదలు పెట్టేసాడు.  

కొరటాల శివ చిరంజీవిల కాంబినేషన్ లో లేటెస్ట్ గా ప్రారంభం అయిన మూవీ షూటింగ్ పూర్తి అయిన తరువాత వచ్చే ఏడాది ఈ ‘లూసిఫర్’ రీమేక్ తెలుగులో ఉంటుంది అని అంటున్నారు. ఈ వార్తలు ఇలా కొనసాగుతూ ఉండగానే చిరంజీవి సుకుమార్ ను పిలిపించుకుని ‘లూసిఫర్’ రీమేక్ గురించి చర్చలు మొదలు పెట్టినట్లు వార్తలు గుప్పు మంటున్నాయి. దీనితో సుకుమార్ బన్నీల మూవీ అసలు ఉండదా లేదంటే ఈ మూవీని చేస్తూనే సుకుమార్ చిరంజీవి ‘లూసిఫర్’ మూవీ రీమేక్ కు స్క్రిప్ట్ రెడీ చేస్తాడా అన్న కన్ఫ్యూజన్ మధ్య సుకుమార్ తో టాప్ హీరోలు ఆడుతున్న గేమ్ ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది..



మరింత సమాచారం తెలుసుకోండి: