తమిళ  నాట ఫుల్ క్రేజ్ ఉన్న స్టార్  హీరో విజయ్, మరియు లేడీ సూపర్ స్టార్ నయనతార జంటగా నటించిన చిత్రం ‘బిగిల్’. ఈ సినిమాను తెలుగులో ‘విజిల్’ పేరుతో విడుదల చెయ్యబోతున్నారు. విజిల్ సినిమాలో ‘వెర్రెక్కిద్దాం’ పాటతో అలరించనున్నాడు విజయ్. ఈ పాటకి ఇప్పటికే  సోషల్ మీడియాలో మంచి క్రేజ్ సంపాదించారు.


 రాజా రాణి  ఫేమ్ అట్లీ ద‌ర్శక‌త్వంలో,దళపతి విజ‌య్ హీరోగా రూపొందుతోన్న స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ఫిలిం ‘బిగిల్‌’. అట్లీ  మరియు విజయ్ కాంబినేషన్లో ఇదివరకు  విడుద‌లైన తెరి,మెర్సల్‌ తెలుగులో అదిరింది సూపర్ బ్లాక్ బ‌స్టర్ చిత్రాలుగా నిలిచాయి. ఇప్పుడు వీరి క‌ల‌యిక‌లో హ్యాట్రిక్ చిత్రంగా ‘బిగిల్‌’ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ట్రైలర్  చాలా సెన్సేషన్ క్రియేట్ చేసింది.  ఈ చిత్రాన్ని తెలుగులో ‘విజిల్’ పేరుతో విడుదల చేస్తు్న్న సంగతి అందరికి తెలిసిందే. అయితే, తమిళ ట్రైలర్‌తో పాటు తెలుగు ట్రైలర్‌ను విడుదల చేయలేదు. కానీ, సినిమాలోని మంచి మాస్ పాట ‘వెర్రెక్కిద్దాం’  మాత్రం మంగళవారం విడుదల చేశారు.

ఎ.ఆర్.రెహమాన్ స్వరపరిచిన ఈ  సాంగ్ పూర్తిగా నాటు దరువుతో  మతిపోగొట్టారు అంటున్నారు విన్నవారంతా. రాకెందు మౌళి సాహిత్యం అందించగా, సింగర్ రేవంత  ఈ పాటను ఆలపించారు. లేడీ సూపర్ స్టార్ న‌య‌న‌తార హీరోయిన్‌గా న‌టిస్తోన్న ఈ సినిమాను, ఏజీయ‌స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకంపై క‌ల్పాతి అఘోరామ్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే తెలుగు అనువాద హక్కులను నిర్మాత మహేశ్ కోనేరు సొంతం చేసుకున్నారు. తెలుగులో  ఈస్ట్ కోస్ట్ బ్యానర్‌పై ఈ సినిమాను విడుదల చేయనున్నారు.

పీఆర్‌వో నుంచి నిర్మాతగా మారిన మహేశ్ కోనేరు,కళ్యాణ్ రామ్‌తో ‘118’ సినిమాను నిర్మించి విజయం సాధించారు.ఈ చిత్రం ప్రేక్షకులను  బాగాఆకట్టుకుంది.ప్రస్తుతం  ఆయన కీర్తి సురేష్‌తో ‘మిస్ ఇండియా’ సినిమాను నిర్మిస్తున్నారు.వెర్రెక్కిద్దాం అంటూ విజయ్ మరియు ఎ.ఆర్.రెహమాన్ నాటు దరువు ,అట్లీ  దర్శకత్వం, ఎలా ఉండబోతుందో వెండి తెర మీద చూడాల్సిందే..


మరింత సమాచారం తెలుసుకోండి: