రెండు ద‌శాబ్దాల విరామం త‌ర్వాత బాలీవుడ్ సూప‌ర్ స్టార్ స‌ల్మాన్ ఖాన్, స్టార్ డైరెక్ట‌ర్ సంజ‌య్ లీలా బ‌న్సాలీ క‌లిసి సినిమా చేస్తున్నార‌ని హిందీ ప్రేక్ష‌కులు ఎంతో ఎగ్జైట్ ఎదురు chusaru. బాలీవుడ్ ఆల్ టైం క్లాసిక్ ‘హమ్ దిల్ చుకే సనమ్’ త‌ర్వాత‌ ఈ డ్రీమ్ కాంబినేష‌న్లో రెండో సినిమాకు ఇన్షా అల్లా అనే టైటిల్ కూడా ఖ‌రారు చేశారు.వ‌చ్చే రంజాన్‌కు ఈ భారీ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రావాల్సింది.

ఆలియా భ‌ట్‌ను క‌థానాయిక‌గా కూడా ఎంపిక చేసి, ప్రి ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ కూడా మొద‌లుపెట్టి రూ.10 కోట్ల దాకా ఖ‌ర్చు కూడా పెట్టాక‌ ఇక సినిమా మొద‌లు కావ‌డ‌మే ఆల‌స్యం అనుకుంటుండ‌గా అనూహ్యంగా ఈసినిమా ఆగిపోయింది తన స్టయిల్లో సినిమా తీయడానికి సల్మాన్ ఒప్పుకోకపోవడం, మార్పులు చేర్పులు సూచించడం.. తాను సూచించిన ఆర్టిస్టుల్ని పెట్టుకోవాలని ఒత్తిడి చేయడంతో బన్సాలీకి నచ్చకపోవడం వలన  ఈ సినిమాను ఆపేసిన‌ట్లు వార్త‌లొచ్చాయి.

కానీ తర్వాత  షారుఖ్‌ను రీప్లేస్ చేసి ఇన్షా అల్లాను ప‌ట్టాలెక్కిస్తాడ‌న్నారు కానీ.. త‌ర్వాత అదేమీ లేద‌ని తేలిపోయింది. బ‌న్సాలీ ఇప్పుడు దీని స్థానంలో కొత్త సినిమా అనౌన్స్ చేశాడు. అది లేడీ ఓరియెంటెడ్ మూవీ కావ‌డం విశేషం. గంగూబాయి క‌ఠియావాడీ పేరుతో తెర‌కెక్క‌నున్న ఈ చిత్రంలో ఆలియాభ‌ట్ లీడ్ రోల్ చేయ‌నుంది.

సినిమా మొద‌ల‌వ‌క‌ముందే రిలీజ్ డేట్ కూడా ప్ర‌క‌టించేశాడు బ‌న్సాలీ. 2020 సెప్టెంబ‌రు 11న ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకొస్తుంది. మొత్తానికి స‌ల్మాన్‌ను వ‌దిలేసినా.. ఇన్షా అల్లా కోసం క‌థానాయిక‌గా ఎంచుకున్న ఆలియాతో స‌ర్దుకుపోతున్నాడ‌న్న‌మాట బ‌న్సాలీ. ఐతే స‌ల్మాన్ లాంటి సూప‌ర్ స్టార్‌తో చేయాల్సిన బ‌న్సాలీ.. లేడీ ఓరియెంటెడ్ మూవీకి ప‌రిమితం కావ‌డం ఆయ‌న అభిమానుల‌కు నిరాశ క‌లిగించే విష‌య‌మే.


మరింత సమాచారం తెలుసుకోండి: