‘అల్లుడు శీను’ చిత్రంతో ఇండస్ట్రీకి గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చాడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్. ఏ స్టార్ హీరో కొడుకు కూడా ఈ రేంజ్లో ఎంట్రీ ఇవ్వలేదు. అంత భారీగా ఎంట్రీ ఇచ్చాడు బెల్లంకొండ. వి.వి.వినాయక్ డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రం ఎబౌ యావరేజ్ గా నిలిచింది. మొదటి చిత్రం కాబట్టి.. అందులోనూ డ్యాన్స్ లు, ఫైట్లు ఇరుక్కటేశాడు కాబట్టి ప్రేక్షకులు పాస్ మార్కులు వేసేశారు. కానీ ఆ తరువాత వచ్చిన ‘స్పీడున్నోడు’ చిత్రం ఘోరంగా డిజాస్టర్ అయ్యింది. బోయపాటి డైరెక్షన్లో చేసిన ‘జయ జానకి నాయక’ చిత్రం పర్వాలేదనిపించినా ఓవర్ బడ్జెట్, అలాగే భారీ రేట్లకి అమ్మడంతో ప్లాప్ గా మిగిలింది. ఇక అటు తరువాత వచ్చిన ‘సాక్ష్యం’ ‘కవచం’ ‘సీత’ మూడు కూడా డిజాస్టర్లే. 

మంచి స్క్రీన్ ప్రెజెన్స్, డాన్సులు, ఫైట్లు.. అదరగొట్టే బెల్లంకొండ నటనలో మాత్రం అంత పరిపక్వత చూపించాడని కామెంట్స్ వస్తూనే ఉన్నాయి. ఇక మనోడు హిట్టు కొట్టడం కష్టమే అనుకున్న తరుణంలో..  ‘రాక్షసుడు’ చిత్రం అలాంటి కామెంట్లకి బ్రేక్ వేసింది. తమిళంలో ఘనవిజయం సాధించిన ‘రాట్ససన్’ చిత్రానికి రీమేక్ గా వచ్చిన ‘రాక్షసుడు’ చిత్రం ఆగష్టు 2(నిన్న) న విడుదలయ్యి సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. రమేష్ వర్మ డైరెక్షన్లో సస్పెన్స్ థ్రిల్లర్ గా  వచ్చిన ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులని అమితంగా ఆకట్టుకుంటుంది.

దీంతో తన రెమ్యూనరేషన్‌ను ఒక్కసారిగా పెంచేశాడట బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌. ప్రస్తుతం తనను సంప్రదిస్తున్న దర్శక నిర్మాతల నుంచి ఒక్కో సినిమాకు పది కోట్ల రెమ్యూనరేషన్‌ డిమాండ్ చేస్తున్నాడట. బెల్లంకొండ బాబు ఈ స్థాయిలో డిమాండ్‌ చేయడానికి మరో కారణం కూడా ఉంది. ఈ యంగ్ హీరో నటించిన సినిమాల హిందీ డబ్బింగ్‌ వర్షన్‌లకు మంచి డిమాండ్‌ ఉంది.బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ నటించిన సినిమాల హిందీ డబ్బింగ్ వర్షన్‌లు యూట్యూబ్‌లో భారీగా వ్యూస్‌ సాధిస్తున్నాయి. ఇక్కడ థియేట్రికల్‌ రన్‌లో ఫ్లాప్‌ అయిన సినిమాలు కూడా యూ ట్యూబ్‌లో 100 మిలియన్ల వ్యూస్‌ సాధించి సత్తా చాటాయి. దీంతో బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ సినిమాలకు ప్రీ రిలీజ్ బిజినెస్‌ భారీ స్థాయిలో జరుగుతోంది. ఈ లెక్కలు వేసుకున్న ఈ యంగ్‌ హీరో తనతో సినిమా చేయలంటే 10 కోట్ల రెమ్యూనరేషన్‌ ఇవ్వాల్సిందే అని డిమాండ్ చేస్తున్నాడట..



మరింత సమాచారం తెలుసుకోండి: