రాజుగారిగది సిరీస్ తెలుగులో కాంచన తర్వాత అంతగా అలరించిన సిరీస్ రాజుగారిగది అని చెప్పుకోవాలి .ఈ శుక్రవారం రాజు గారి గది లోని మూడవ సినిమా రాజు గారి గది 3 
 రిలీజ్ అయింది .ఈ సినిమా రివ్యూ ఈ విధంగా ఉంది.
 ఈ సినిమాలో హీరోగా అశ్విన్ హీరోయిన్ అవికా గోర్ నటించారు .ఇక అశ్విని ఒక ఆటో డ్రైవర్ గా కనిపిస్తాడు  అందర్నీ చికాకు తెప్పిస్తు ఉంటాడు .అవికా గోర్ మాయగా కనిపిస్తుంది .అశ్విన్ ఈ అమ్మాయి తో ఇలా అయినా ప్రేమలో పడాలని స్కెచ్ వేసాడు ప్రపోజ్ చేసే సమయంలో అనుకోని పరిణామాలు చోటు చేసుకుంటాయి. అసలు ఈ మాయ ఎవరు?  ఆమె వెనుక ఉన్న అసలు కథ ఏమిటి?? ఆ సస్పెన్స్ ని ఎలా చేదించడం??
 సినిమా దర్శకుడు గత రెండు చిత్రాలతో పోలిస్తే ఈ సినిమాలో కామెడీ పై ఎక్కువ దృష్టి పెట్టినట్లు అనిపించింది. సెకండ్ హాఫ్ లోని ఒక బూతు బంగ్లాలో వచ్చే 20 నిమిషాల హర్రర్ కామెడీ ఎపిసోడ్ చాలా బాగా ఉంది ప్రజల్ని బాగా ఆకర్షిస్తుంది. అశ్విన్ నటన పరంగా లుక్స్ పరంగా చాలా పరిణితి కనిపించింది అని చెప్పవచ్చు. టాలీవుడ్ సీనియర్ కమెడియన్ అలీ చాలా రోజుల తర్వాత బాగా నవ్వించే రోడ్ లో కనిపించనున్నాడు.
 దర్శకత్వం ఎంత బాగున్నా ఓంకార్ స్క్రిప్ట్ మీద కొంచెం శ్రద్ధ పెట్టి ఉంటే ఇంకా బాగుండేది అని అనిపిస్తుంది సినిమాలో కామెడీ బాగున్నది మెయిన్ స్టోరీ కి సైడ్ ట్రాక్ పటిచినట్లుగా  అనిపిస్తుంది. ఈ సినిమాలో కెమెరామెన్ ఛోటా.కె.నాయుడు పనితనం అద్భుతంగా ఉందని చెప్పాలి. షబ్బీర్ అందించిన సంగీతం పరవాలేదనిపించింది బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం చాలా బాగా చేశాడు. చివరిగా కథాకథనాలు ఎలా  ఉన్నఎంటర్టైన్మెంట్ కావాలి అని కోరుకునే వాళ్ళు ఈ సినిమాని ఒకసారి చూడవచ్చు అని చెప్పవచ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి: