వైల్డ్ కార్డ్ ద్వారా మళ్ళీ బిగ్ బాస్ హౌస్ లోకి రీఎంట్రీ ఇచ్చిన అలీ...పెద్దగా అగ్రెసివ్ కాకుండా
గేమ్ ఆడుతూ వచ్చాడు. కేవలం మాటలతో ఇతర కంటెస్టంట్స్ ని నెగిటివ్ చేసే ప్రయత్నం చేశాడు. ముఖ్యంగా హౌస్ లోకి వచ్చిన దగ్గర నుంచి
బాబా భాస్కర్ ని టార్గెట్ చేస్తూ వచ్చాడు. ఈ క్రమంలోనే బిగ్ బాస్ ఇంట్లో మిగిలిన ఆరుగురు సభ్యులకు నామినేషన్ టాస్క్ ఇచ్చాడు. ఈ టాస్క్ లో ఒక్కరే గెలిచే నేరుగా ఫినాలే కు వెళ్లతారు. మిగిలిన ఐదుగురు ఈ వారం ఎలిమినేషన్‌కు నామినేట్ అవుతారు.
అయితే ఈ టాస్క్ లో భాగంగా మంగళవారం ఎపిసోడ్లో మట్టిలో పూలు నాటే పోటీ పెట్టారు. ఇందులో
బాబా, అలీలు పోటీ పడ్డారు. ఈ పోటీలో ఎవరి పూలు వారు నాటుతూనే మిగిలిన వారి పూలు లాగేయొచ్చు. చివరికి మట్టిలో ఎవరి పూలు ఎక్కువగా ఉంటే వారు గెలుస్తారు. దీంతో టాస్క్ మొదలవ్వడమే...ఇద్దరు పూలు నాటేశారు. కానీ గెలవడమే లక్ష్యంగా పెట్టుకున్న అలీ...బాబా పూలని లాగేయడం మొదలుపెట్టారు. తర్వాత
బాబా కూడా తగ్గకుండా
అలీ పూలు లాగేశాడు.
ఇక అలా అలా వారి మధ్య కుమ్ములాట తీవ్ర స్థాయికి చేరుకుంది. ముఖ్యంగా
అలీ తన సిక్స్ ప్యాక్ బాడీతో
బాబా భాస్కర్ని ఫుట్ బాల్ ఆడేశాడు.
బాబా ఎంత ప్రయత్నించినా తొట్టెలో పూలు పెట్టకుండా అడ్డుకున్నాడు.
బాబా కూడా గట్టిగానే పోరాడాడు. ఈ క్రమంలోనే
అలీ మరి కోపం తెచ్చేసుకుని క్రూరంగా ప్రవర్తించడంతో బిగ్ బాస్ హెచ్చరించాడు. అయిన
అలీ తగ్గకుండా
బాబా భాస్కర్ని తలతో కొట్టడంతో
బాబా భాస్కర్ ఎగిరి అవతల పడ్డాడు.
ఆలీ బిగ్‌బాస్ వార్నింగ్ ఇచ్చినా కూడా చేతులతో నెట్టడం.. బల ప్రదర్శన చూపించడం వల్ల టిక్కెట్ టు ఫినాలే నుండి అలీని తప్పిస్తున్న ప్రకటించారు.
ఇక ఇప్పటికే బిగ్‌బాస్ హౌస్‌లో రెండు వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఇచ్చారు. ట్రాన్స్ జెండర్ తమన్నా సింహాద్రి, ఫేడవుట్ యాంకర్
శిల్పా చక్రవర్తి వచ్చి రెండు వారాలకే వెళ్లిపోయారు. ఇక ఇప్పుడు వైల్డ్ కార్డ్ ద్వారా రీ ఎంట్రీ ఇచ్చిన ఆలీ కూడా ఈ వారం ఎలిమినేషన్లో హౌస్ నుంచి అవుట్ అవుతాడనే చర్చలు స్టార్ట్ అయ్యాయి. రీ ఎంట్రీ ఇచ్చిన ఆలీ తన ప్రవర్తనతో ఎక్కువ మైనస్ మార్కులు వేయించుకున్నారు.