మాములుగా పండక్కి కొత్త సినిమా వస్తుంటే అభిమానుల్లో తెలియని ఒక కొత్త ఉత్సాహం ఉప్పెనలా మారుతుంటుంది. అదే దీపావళి వస్తుంటే ఇంకా ఎంతో సంతోషంగా ఉంటారు. అలాంటిది ఇప్పుడు దీపావళికి ఏకంగా విజయ్,కార్తిక్ లాంటి పెద్ద హీరోలు అటు తమిళ, ఇటు తెలుగు లో హాల్ చల్ చేయనున్నారు. అంతా బాగానే ఉంది కాని అసలు తంట ఇప్పుడే మొదలైంది. పెద్ద హీరోల సినిమాలకు ఓపెనింగ్స్ రావాలి అంటే మాత్రం ఖచ్చితంగా ఫాన్స్ షో, ప్రివ్యూ షో వేస్తారు. అలాంటిది తమిళ గవర్నమెంట్ మాత్రం ఇద్దరు హీరోలకు పర్మిషన్ వెయ్యలేదు.

పండగ అంటే ఖచ్చితంగా టపాసులు మాత్రమే కాల్చుకోవాలి కానీ గొడవలకు., కొట్లాటలకు పోకూడదు అని ఈ నిర్ణయం తీసుకున్నట్లు వారు తెలియజేశారు. అందు నిమిత్తం అక్టోబర్ 25న సినిమా రిలీజ్ చేసుకోమని ఎలాంటి గొడవలు పెట్టొద్దని అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. దాంతో ఫాన్స్ గందరగోళంగా మారిపొయ్యారు. దాంతో అభిమాన లోకం అంత కూడా పండగను ముందు జరుపోకోవాలా లేక తర్వాత జరుపుకోవాలో అర్థం కాలేని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నారు.

ఇలానే అన్ని సినిమా ఇండస్ట్రీలో జరిగితే ఓపెనింగ్స్ కష్టం అంటున్నారు డిస్ట్రిబ్యూటర్స్. సామాన్య జనం మాత్రం మంచి పని చేసారు అంటూ కొందరు సంబర పడుతున్నారు., మరికొందరు విచారణలో పడ్డారు. దాంతో పండగ అనేది  పది మందితో పంచుకొనేది కానీ ఆంక్షలతో బతకడం కష్టం అన్నట్లుగా ప్రవర్తించడం బాలేదని కొందరు ఫాన్స్ మాత్రం మా హీరో హీరో హిట్టు కొడతాడు..., అంటూ పండగ చేసుకోవడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. ఏదేమైనా గవర్నమెంట్ వారు పెట్టిన ఈ నిబంధన ఎంత వరకు వెళ్లనుందో వేచి చూడాలి. తమిళ తెలుగు హిట్ కాంబినేషన్ ఎలా ఉండనుందో ఏంటో....!!! 

 

మరింత సమాచారం తెలుసుకోండి: