ఈ మధ్య కాలంలో బాలీవుడ్ కి టాలీవుడ్ దెయ్యం పట్టినట్లు ఉంది ..అందరూ అదే ఫాలో అవుతున్నారు.. ఏంటంటే.. బాలీవుడ్ సినిమాలను ఒకప్పుడు తెలుగు వాళ్ళు చేసేవారు.. కానీ ఈ మధ్య తెలుగును హిందీ సినీ ప్రపంచం కాపీ కొడుతుంది.. వరుసగా తెలుగు సినిమా హాకులను తీసుకొని ఆ దర్శక నిర్మాతలు అదే తెరకెక్కిస్తున్నారు. 


నిన్న కాక మొన్న అర్జున్ రెడ్డి సినిమా రీమేక్ కబీర్ సింగ్ హిందీలో రీమేక్ అయ్యి ఎంత సక్సెస్ అయ్యి ఎంత హిట్ ను సాధించిందో అందరికి తెలిసిందే..మున్ముందు తెలుగు సినిమాలన్నీ హిందులో వస్తాయని వేరేలా చెప్పనక్కర్లేదు. మరో తెలుగు బ్లాక్ బాస్టర్ సినిమాను హిందీలో రీమేక్ చేయాలనే ఆలోచనలో ఆ చిత్ర నిర్మాతలు ఉన్నారట.


అనుష్క నటించిన బాగమతి సినిమా ఏ రేంజులో హిట్ అయ్యిందో అందరికి తెలిసిన విషయమే..బాగమతి డైరెక్టర్ కు ఓ హిందీ నిర్మాణ సంస్థ బంపర్ ఆఫర్ ఇచ్చింది. అదేంటంటే ఈ సినిమాను హిందీలో తెరకెక్కించాలనే ఫ్లాన్ లో ఉందట.. అనుష్క పాత్రలో భూమిక  నటించాలనే ఆలోచనలో ఉండగా ఆనుష్కలాగా ఆమె చేయలేదని అభిమానులు అంటున్నారు..భూమిక ఫెడ్నకర్ ఇప్పటి వరకు చేసిన సినిమాలు అన్ని రొమాంటిక్ సినిమాలే.. అవి బాగా హిట్ అయ్యాయి అయితే కోపంగా ఉండేలా ఈ సినిమాలో నటిస్తుందంటే అందరు ఆలోచనలో పడ్డారు.  


ఈ అమ్మడు కమేర్షియల్ సినిమాలు చేశారు గాని  లేడి ఓరియెంటెడ్ సినిమాలలో మాత్రం నటించలేదు . ఎంత పెద్ద ప్రాజెక్ట్ ను ఆమె చేయలేదని అందరూ చెవులు కోరుకుంటున్నారు. మరి అనుష్క రేంజులో ఎవరు పెర్ఫార్మన్స్ చేస్తారో , దానికి దీటుగా ఎవరిని దించుతారో చూడాలి.. ఈ సినిమా ఏ రేంజులో రాణిస్తుందో చూడాలి మరి..


మరింత సమాచారం తెలుసుకోండి: