ప్రతి మనిషి జీవితంలో పెళ్లి అన్నది అవసరమే. కొంతమంది ఆశయాల కోసం పెళ్ళికి దూరంగా ఉంటారు. పెళ్ళికి దూరంగా ఉంటూనే... విజయం సాధిస్తుంటారు. అయితే, పెళ్లి చేసుకునే ఛాన్స్ ఉండి.. సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు ఉన్నాకానీ, కొంతమంది పెళ్ళికి దూరంగా ఉంటారు. అటువంటి వ్యక్తుల్లో
సల్మాన్ ఖాన్ ఒకరు.
సల్మాన్ ఖాన్ పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు అంటే అయన సమాధానం చెప్పరు.
ఇప్పుడు 50 ఏళ్ళు వచ్చాయి. ఇప్పుడు పెళ్లిమాట ఎత్తినా బాగుండదు.. సినీరంగంలో వయసుతో సంబంధం ఏముంది.. హీరోలు కాబట్టి ఏ వయసులో పెళ్లి చేసుకున్నా పర్వాలేదు.
సల్మాన్ ఖాన్ కు పెళ్లి చేసుకోవాలనే ఆలోచన రాలేదా అంటే.. వచ్చింది. ఆలోచన వచ్చింది. కానీ, ఎందుకో ఆ ఆలోచనను అమలు చేయడంలో
సల్మాన్ విఫలం అయ్యాడు. అప్పుడెప్పుడో అంటే 1999లో
సల్మాన్ ఖాన్ పెళ్లి చేసుకోవాలనే ఆలోచన వచ్చిందట.
అన్ని సిద్ధం అయ్యాయి.
సల్మాన్ ఓ అమ్మాయిని కూడా చూసుకున్నాడు. అదే సమయంలో దర్శకుడు, నిర్మాత సాజిద్ కు కూడా ఇంట్లో పెళ్లి చేయాలని అనుకున్నారు.
సల్మాన్ కూడా వివాహానికి సిద్ధం కావడంతో.. ఇద్దరి వివాహం ఒకేసారి చేస్తే బాగుంటుందని ఇరు కుటుంబాలు అనుకున్నాయి.
సల్మాన్, సాజిద్ లు మంచి దోస్తులు.
సినిమా రంగంలో ఇద్దరు బాగా పాపులర్ అయ్యారు. మరేమయిందో తెలియదు. పెళ్లి మరో ఐదు రోజులు ఉందనగా
సల్మాన్ పెళ్లిని క్యాన్సిల్ చేసుకున్నాడు.
అయితే సాజిద్ వివాహం మాత్రం జరిగింది. వివాహం జరిగే రోజున
సల్మాన్ వచ్చి.. బయట కారు ఉన్నది.. తీసుకొని పారిపో అని చెప్పాడట. అలా ఎందుకు చెప్పాడు అన్నది తనకు అర్ధం కాలేదని సాజిద్ ఇటీవలే పేర్కొన్నాడు. 1999లో వివాహం చేసుకోవాలని రెడీ అయ్యి, అమ్మాయిని చూసుకొని కూడా వివాహానికి దూరం అయ్యాడు అంటే.. అక్కడ ఏదో బలమైన సంఘటన జరిగే ఉండాలి. అది
సల్మాన్ మనసులో వివాహంపై ప్రభావం చూపించి ఉండాలి. అదేంటి.. ఆ అమ్మాయి ఎవరు అన్నది
సల్మాన్ చెప్తేనే బాగుంటుంది.
సల్మాన్ చెప్తాడా చెప్పండి.