969 ప్రాంతంలో ఉస్మానియా యూనివర్సిటీ రాజకీయాలలో ఒక సంచలన వ్యక్తిగా మారి హత్యకు గురైన జార్జ్ రెడ్డి జీవితాన్ని ఆధారంగా తీసుకుని తీసిన మూవీ ట్రైలర్ ఇప్పటికే విపరీతంగా పాపులర్ కావడంతో ఈమూవీ మరో ‘అర్జున్ రెడ్డి’ అవుతుందా అన్న సందేహాలు కలుగుతున్నాయి. నవంబర్ 22న ఈమూవీని విడుదల చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. 

ఇది ఇలా ఉండగా ఈమూవీ ట్రైలర్ పవన్ కు విపరీతంగా నచ్చడంతో పవన్ తనకు తానుగా ఈమూవీ దర్శకుడు జీవన్ రెడ్డికి ఫోన్ చేసి అభినందించినట్లు తెలుస్తోంది. పవర్ స్టార్ నుండి ప్రశంసలు రావడంతో జీవన్ రెడ్డి పవన్ ను కలిసి ఈమూవీ గురించి పూర్తి విశేషాలు చెప్పడమే కాకుండా ఈమూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు అతిధిగా రావలసిందిగా కోరిన వెంటనే పవన్ అంగీకరించినట్లు టాక్.

దీనితో ఈమూవీ హక్కులను ఇప్పటికే పొందిన అభిషేక్ నామా మంచి జోష్ లోకి వెళ్ళిపోవడమే కాకుండా ఈమూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ ను అత్యంత భారీస్థాయిలో చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. రాడికల్ భావాలు చాల ఎక్కువగా ఉండే జార్జ్ రెడ్డి చదువులో యూనివర్సిటీ ఫస్ట్ రావడమే కాకుండా బాస్కెట్ బాల్ గేమ్ లో నేషనల్ టీమ్ కు ఎంపిక అయిన వ్యక్తి. 

అలాంటి వ్యక్తిని కొన్ని రాజకీయ దుష్ట శక్తులు అప్పట్లో చంపడం 1969 ప్రాంతంలో ఒక సంచలన వార్త. ఇప్పుడు అలాంటి వ్యక్తి జీవితాన్ని ఈనాటి తరానికి పరిచయం తీస్తున్న ఈబయోపిక్ కు సామాజిక చైతన్యం ఎక్కువగా ఉండే పవన్ సపోర్ట్ లభించడం ఈమూవీ దర్శక నిర్మాతల అదృష్టం. తెలంగాణ ఉద్యమం పై అదేవిధంగా తెలంగాణ సంస్కృతి పై ఎంతో మక్కువ ఉన్న పవన్ కళ్యాణ్ మనసుకు నచ్చే అనేక విషయాలు ఈమూవీలో ఉండటంతో పవన్ కనెక్ట్ అవుతున్నాడు అనుకోవాలి..  


మరింత సమాచారం తెలుసుకోండి: