ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ ఖాన్ దాదా సల్మాన్ ఖాన్ నిన్న హైదరాబాద్ లో సందడి చేసాడు. డిసెంబర్ లో విడుదలకాబోతున్న తన ‘దబాంగ్ 3’ మూవీ ప్రమోషన్ ను చాల ముందుగా మొదలు పెట్టి ఈమూవీ ట్రైలర్ ను నిన్న లాంచ్ చేసాడు. ఈసందర్భంలో మీడియాతో మాట్లాడుతూ ఒక షాకింగ్ విషయాన్ని బయట పెట్టాడు సల్మాన్. 

తాను త్వరలో మళ్ళీ హైదరాబాద్ రాబోతున్నానని పూరి జగన్నాథ్ చెప్పబోయే కథను వినబోతున్నానని లీకులు ఇచ్చాడు. దీనితో త్వరలో పూరి సల్మాన్ కాంబినేషన్ కు రంగం సిద్ధం కాబోతోందా అన్న సందేహాలు వస్తున్నాయి. ఈ మధ్యకాలంలో సల్మాన్ సినిమాలకు క్రేజ్ తగ్గుతున్న నేపధ్యంలో తన మూవీ కథల విషయంలో విభిన్నంగా వ్యవహరించాలని సల్మాన్ నిర్ణయం తీసుకున్న నేపధ్యంలో సల్మాన్ అడుగులు పూరి ‘డెన్’ వైపు పడుతున్నాయా అన్న కామెంట్స్ వస్తున్నాయి.

ఇదే మీడియా మీట్ లో సల్మాన్ మరొక ట్విస్ట్ ఇస్తూ ‘దబాంగ్ 3’ మూవీ గురించి ఆ మూవీ విడుదల అయ్యాక మీడియా ఎన్ని విమర్శలు చేయాలో అన్ని విమర్శలు స్వేచ్చగా చేసుకోవచ్చని చెపుతూ ఎన్ని విమర్శలు చేసినా తన మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అన్న ఆత్మవిశ్వాసం వ్యక్త పరిచాడు. ప్రభుదేవా దర్శకత్వంలో నిర్మాణం జరుపుకున్న ఈ మూవీలో సల్మాన్ కొన్ని వెరైటీ మాస్ స్టెప్స్ వేసినట్లు వార్తలు వస్తున్నాయి. 

అంతేకాదు ఈమూవీని తెలుగు కన్నడ మళయాళ భాషలలో డబ్ చేసి విడుదల చేస్తూ సల్మాన్ తన మార్కెట్ ను దక్షిణాది రాష్ట్రాలలో పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. చిరంజీవి ‘సైరా’ ను హిందీలో డబ్ చేసి విడుదల చేసినా అక్కడి బాలీవుడ్ ప్రేక్షకులు పట్టించుకోలేదు. అయితే సల్మాన్ లాంటి ఒక ఉత్తరాది ప్రాంత హీరో తన సినిమాను తెలుగులో డబ్ చేసి విడుదల చేయడం చూస్తుంటే మన తెలుగు ప్రేక్షకులు పరాయి భాషల హీరోలను ఎంతగా ఆరాదించి ప్రోత్సహిస్తారో దీనినిబట్టి అర్ధం అవుతుంది.. 


మరింత సమాచారం తెలుసుకోండి: