బాలీవుడ్ లో ఉన్న టాలెంటెడ్ నటులలో నవాజుద్దీన్ సిద్ధిఖి ఒకరు. నానా పాటేకర్, నసిరుద్దీన్ షా, ఓం పురి అంతటి గొప్ప నటుడు నవాజుద్దీన్ అని చెప్పొచ్చు. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న లేటెస్ట్ సినిమా మోతిచూర్ చక్నాచూర్. ఈ జనరేషన్ కథతో రూపొందించిన పక్కా కామెడీ ఎంటర్ టైనర్ గా రూపొందుతోంది.  ఈ సినిమాలో నవాజుద్దీన్ పుష్పిందర్ త్యాగి అనే పాత్రలో నటిస్తున్నాడు. మిడిలేజీకి చేరుకున్న త్యాగి పెళ్ళి చేసుకోవడమే యాంబిషన్ గా పెట్టుకుంటాడు. ఇందులో ఆతియా శెట్టి కథానాయికగా నటిస్తోంది. ఆ ఇద్దరి మధ్య అన్ యూజువల్ లవ్ స్టోరి తెరపై గిలిగింతలు పెడుతుందట. తూర్పు పడమరల కలయికలా ఆ ఇద్దరి పరిచయం ఉంటుందట. ఆతియా బాగా సెటిలైన ఓ ఎన్నారై కుర్రాడిని పెళ్ళి చేసుకోవాలని ఆశతో ఉంటుంది. 

ఆ తర్వాత నవాజ్ తో పరిచయం ప్రేమ వంటి ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ తో కథ సాగుతుందట. ఇటీవలే ఈ సినిమా ట్రైలర్ రిలీజై పెళ్ళి కాని యూత్ ని బాగా ఆకట్టుకుంది. 
ఇక తాజాగా ఈ సినిమా నుంచి భత్యమ్ బుచారో.. అంటూ సాగే ఓ పాటను రిలీజ్ చేశారు. ఈ పాటలో సన్నీలియోన్ తో కలిసి నవాజుద్దీన్ అదిరిపోయే స్టెప్పులేశాడు. ఇక సన్నీ చాలా గ్యాప్ తర్వాత తిరిగి ట్రాక్ లో పడిందని ఈ సాంగ్ చూస్తే అర్థమవుతుంది.ఇక ఐటెమ్ స్పెషలిస్ట్ అంటే సన్నీనే అన్నంతగా ఈ పాటను చిత్రీకరించారు. 

ఇక ఎంతో ఫన్నీగా చిత్రీకరించిన ఈ పాటలో నవాజుద్దీన్ మూవ్ మెంట్స్ .. ఎక్స్ ప్రెషన్స్ ఫెంటాస్టిక్ అని పొగిడేస్తున్నారు. నవంబర్ 25న మోస్ట్ అవైటెడ్ ఈ సినిమా గా రిలీజ్ కానుంది. ఇకపోతే సన్నీలియోన్ ఇటీవల స్టార్ స్టక్ సౌందర్య ఉత్పత్తుల కంపెనీ ప్రారంభించి ప్రమోషన్స్ లో బిజీగా ఉంటోంది. సౌత్ లో మూడు నాలుగు భాషల్లో ఓ భారీ సినిమాకి సంతకం చేసిందని ఇంతకముందే వార్త వచ్చింది. మరి ఆ ప్రాజెక్ట్ కు సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి అప్‌డేట్స్ ఐతే రాలేదు.



మరింత సమాచారం తెలుసుకోండి: