ఇళయ దళపతి విజయ్ నటించిన  లేటెస్ట్ మూవీ విజిల్ మంచి అంచనాల  మధ్య నిన్న విడుదలై  పాజిటివ్ రివ్యూస్ ను రాబట్టుకుంది. దాంతో ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో  అదిరిపోయే ఓపెనింగ్స్ ను రాబట్టుకుంది. సుమారు 700 స్క్రీన్ లలో  విడుదలైన ఈ చిత్రం  ఏపీ &తెలంగాణ లో కలిపి మొదటి రోజు 2.50 కోట్ల షేర్ ను రాబట్టింది. తద్వారా విజయ్ కెరీర్ బెస్ట్  ఓపెనింగ్ గా విజిల్ రికార్డు సృష్టించింది.  గత ఏడాది విజయ్ నటించిన సర్కార్ మొదటి రోజు 2.32కోట్ల షేర్ ను  అలాగే అదిరింది 1.33 కోట్ల షేర్ ను రాబట్టాయి. 




ఇక నైజాంలో అయితే విజిల్ 72 లక్షల షేర్ ను రాబట్టగా ఇంతకుముందు సర్కార్ 73లక్షల షేర్  ను కలెక్ట్ చేసింది.  ఇప్పట్లో  తెలుగులో పెద్ద సినిమాల విడుదల లేకపోవడంతో ఈచిత్రం  ఫుల్ రన్ లో బ్రేక్ ఈవెన్ కావడం ఖాయం గా కనిపిస్తుంది.  అయితే   కార్తి నటించిన ఖైదీ కూడా నిన్న విడుదలై సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకోవడంతో  విజిల్ కి బాక్సాఫీస్ వద్ద గట్టి పోటీ ఎదురుకానుంది. విజిల్ ను మహేష్ ఎస్ కోనేరు తెలుగు లో విడుదలచేయగా  తెలుగు రాష్ట్రాల్లో  10కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసింది. ఇదిలా ఉంటే ఒరిజినల్ వెర్షన్  బిగిల్ తమిళనాడు లో మొదటి రోజు రికార్డులు సృష్టించిందని  సమాచారం.  అక్కడ ఈ చిత్రం సుమారు 25కోట్ల షేర్ ను రాబట్టిందని తెలుస్తుంది.  అట్లీ  డైరెక్షన్ లో స్పోర్ట్స్ డ్రామా గా తెరకెక్కిన  ఈ చిత్రంలో  విజయ్  కి జోడిగా నయనతార నటించగా  ఏఆర్ రెహమాన్ సంగీతం అందించాడు.   180కోట్ల భారీ బడ్జెట్ తో  ఏజీఎస్ ఎంటర్ టైన్మెంట్స్ ఈచిత్రాన్ని నిర్మించింది  


మరింత సమాచారం తెలుసుకోండి: