సింగర్ రాహుల్ సిప్లిగంజ్ బిగ్ బాస్ షోకు రాకముందు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేకపోయినా ఈ షో ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. టాస్క్ లపై, గేమ్ పై పెద్దగా ఫోకస్ చేయకపోయినా ఫినాలే టాస్క్ లో విన్ అవటంతో రాహుల్ సిప్లిగంజ్ ఫైనల్ కు చేరాడు. పునర్నవితో రాహుల్ కు ఉన్న లవ్ ట్రాక్ రాహుల్ కు చాలా ప్లస్ అయింది. రాహుల్ చాలాసార్లు ఎలిమినేషన్ కు నామినేట్ అయినా రాహుల్ ఫ్యాన్స్ రాహుల్ ను సేవ్ చేసుకుంటూ వచ్చారు. 
 
కానీ ప్రస్తుతం రాహుల్ సిప్లిగంజ్ గతంలో బిగ్ బాస్ షోలోని ఇంటి సభ్యులపై చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఫినాలే టాస్క్ ద్వారా ఫైనల్ కు చేరటంతో రాహుల్ విన్ అవుతాడంటూ ప్రచారం చేస్తున్న ఫ్యాన్స్ కు ఈ వీడియో షాక్ ఇస్తోంది. ఈ వీడియో వలన రాహుల్ బిగ్ బాస్ విన్నర్ అవటం కష్టమే అనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఈ వీడియో రాహుల్ ఓట్లకు కూడా గండికొట్టే విధంగా విధంగా ఉంది. 
 
బిగ్ బాస్ సీజన్ 1 సమయంలో రాహుల్ సిప్లిగంజ్ పాడిన మంగమ్మ అనే ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్ ను బిగ్ బాస్ షోలో ప్లే చేశారు. ఆ సమయంలో బిగ్ బాస్ సీజన్1 లో పాల్గొన్న సెలబ్రిటీలు ఈ సాంగ్ గురించి కామెంట్స్ చేశారు. బిగ్ బాస్ షోలోని సభ్యులు చేసిన కామెంట్స్ తో కోపంతో ఊగిపోయిన రాహుల్ భీభత్సకరమైన బూతు పదాలతో సోషల్ మీడియాలో ఒక వీడియో పోస్ట్ చేశాడు. 
 
గతంలో రాహుల్ సిప్లిగంజ్ ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేడు కాబట్టి ఈ వీడియో వైరల్ కాలేదు. కానీ ప్రస్తుతం రాహుల్ ఫినాలే టాస్క్ లో గెలిచి ఫైనల్ కు చేరటంతో మరియు రాహుల్ ప్రేక్షకులకు రాహుల్ ఇప్పుడు బాగా సుపరిచితుడు కావటంతో ఈ వీడియో వైరల్ అవుతోంది. రాహుల్ సిప్లిగంజ్ ఫ్యాన్స్ మాత్రం ఎవరో కావాలని ఈ వీడియోను వైరల్ చేశారని చెబుతున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: