తమిళ సినిమాలు తెలుగులోకి డబ్ కావడం బ్లక్ అండ్ వైట్ సినిమాల నుంచీ జరుగుతున్నదే. ఆయా సినిమాలకు తెలుగు ప్రేక్షకులు ఆదరించారు.. ఆదరిస్తున్నారు కూడా. కానీ విషయమేమిటంటే తెలుగు సినిమాలను తమిళ్ లో అసలు పట్టించుకోరు. చెన్నైలో తప్ప మిగిలిన రాష్ట్రమంతా ఏదో విడుదలయ్యాయి అనిపిస్తాయి తప్ప మనమిచ్చేంత ఆదరణ ఉండదు.

 

 

ఇప్పుడు దీపావళికి ఏకంగా రెండు తమిళ డబ్బింగ్ సినిమాలు తెలుగులోకి వచ్చేశాయి. కార్తీ ఓ ఇంటర్వ్యూ ఇచ్చి ప్రమోట్ చేసుకున్నాడు. విజయ్ తన విజిల్ సినిమాకు కనీసం ప్రమోషన్ కు హైదరాబాద్ రాలేదు. తెలుగు ప్రేక్షకులంటే ఇంత చులకన భావం ఉన్నప్పుడు ఆ సినిమా మేమెందుకు చూడాలని ఇంటర్నెట్ లో కామెంట్లు వైరల్ అవుతున్నాయి. మా డబ్బులు కావాలి కానీ.. ఇక్కడికి వచ్చి ప్రమోట్ చేసుకునే టైమ్ లేదా అని సెటైర్లు వేస్తున్నారు. తనకు ఖాళీ లేదంటూ.. సినిమా యూనిట్ ను మాత్రమే పంపించడం తెలుగు ప్రేక్షకులపై విజయ్ కు ఉన్న చులకన భావమే అంటున్నారు. వాళ్లే చూస్తారులే.. అనే ఉద్దేశమే ఇది అని నెటిజన్లు మండిపడుతున్నారు.

 

 

2005లో మన తెలుగు సినిమాల కంటే చంద్రముఖి, ప్రేమిస్తా, అపరిచితుడు, మన్మథ, గజినీ.. లాంటి సినిమాలు మొత్తం మీద 100 కోట్లు తీసుకెళ్లాయి. అంటే మనం ఏస్థాయిలో తమిళ సినిమాను ఆదరిస్తున్నామో అర్ధం చేసుకోవచ్చు. సైరా సినిమా తమిళ్ లో డైరక్ట్ గా రిలీజ్ చేస్తే చిరంజీవి సినిమా అని కూడా చూడకుండా ఏ తమిళ హీరో కూడా కనీసం ఓ ట్వీట్ కూడా చేయలేదు. రజినీకాంత్ కూడా చిరంజీవికి పర్సనల్ గా ఫోన్ చేసి అభినందించటమే చేశాడు. కమల్ మాత్రం వాయిస్ ఓవర్ ఇచ్చాడు. ఇదీ తెలుగు సినిమాకు, హీరోలకు, ప్రేక్షకులకు దక్కుతున్న తమిళ గౌరవం.

 


మరింత సమాచారం తెలుసుకోండి: