మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిన ప్రెస్టీజీయస్ మూవీ సైరా. భారీ బడ్జెట్ తో నిర్మితమైన ఈ సినిమాలో మెగాస్టార్ నటనకు ప్రశంసలు దక్కాయి. తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్లు రాబట్టిన ఈ సినిమాతో చిరంజీవి బాక్సాఫీస్ స్టామినా ఏంటో మరోసారి రుజువైంది. ఈ సినిమాలో చిరంజీవి మార్క్ కామెడీ, పాటలు, డ్యాన్సులు లేవు. ఇక్కడ గమనించాల్సిన విషయమేమిటంటే..

 


అమిత్ త్రివేది సంగీతం అందించిన ఈ సినిమాలో నాలుగు పాటలు ఉన్నాయి. టైటిల్ సాంగ్, జాతర, దేశభక్తి పాట మాత్రమే సినిమాలో ఉన్నాయి. మరి ఆడియోలో ఉన్న నాలుగోపాట తెర మీద కనపడలేదు. దీనిపై నిర్మాత రామ్ చరణ్ ఇటివల ఓ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చాడు. చిరంజీవి – తమన్నాపై తెరకెక్కించిన ఈ పాటను దాదాపు 8కోట్లతో తెరకెక్కించినట్టు తెలిపాడు. పాట కూడా చాలా బాగా వచ్చిందన్నాడు. అయితే సినిమా లెంగ్త్ పెరిగిపోవడంతో ఈ పాటను సినిమాలో యాడ్ చేయలేదని చెప్పాడు. దీంతో అంత ఖర్చె పెట్టిన పాటను ధియేటర్లో చూసే అవకాశం దక్కలేదు. ఖర్చుకు ఎక్కడా రాజీ పడని చరణ్పాట విషయంలో కూడా ఇదే చేశాడని అర్ధమవుతోంది. అమిత్ త్రివేది సంగీతం ఈ సినిమాకు బాగా ప్లస్ అయిందని చెప్పక తప్పదు.

 


నిజానికి.. సైరా సినిమా అంతా సీరియస్ గానే సాగుతుంది. కామెడీ, డ్యాన్సులు లేకపోయినా చిరంజీవి సినిమాకు కలెక్షన్లు రావడమంటే సినిమాలో చిరంజీవి తన నటనతో ఎంత మెస్మరైజ్ చేశాడో అర్ధమవుతోంది. ఇలాంటి సినిమాలో ఆ డ్యూయట్ ఖచ్చితంగా ఇరికిచ్చినట్టే ఉండేదేమో. ఈ సినిమా విజయం తమకెంతో స్పెషల్ అని దీపావళి గిఫ్ట్ అని చెప్పుకొచ్చాడు చరణ్. జనరేషన్ చేంజ్ లో కూడా సీనియర్ హీరోగా మెగాస్టార్ సృష్టించిన ప్రకంపనలు మామూలు విషయం కాదు.

 


మరింత సమాచారం తెలుసుకోండి: