అల్లు అర్జున్ తో  తమన్ కలిసి పనిచేసిన రేసుగుర్రం ,సరైనోడు సినిమా రెండూ కూడా మ్యూజిక్ పరంగా మరియు కలెక్షన్ల పరంగా ఎన్నో రికార్డులు సృష్టించాయి. ముఖ్యంగా ఆ రెండు సినిమాల్లో ఉన్న బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కమర్షియల్ సినిమాలలో ఒక మైలు రాయి గా నిలిచాయి .అలాగే వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న మూడో చిత్రం అల వైకుంఠపురంలో కూడా ఇలాంటి మ్యాజిక్ ఏ జరగాలని ప్రజలు,అభిమానులు  కోరుకుంటున్నారు.


 ఈ సినిమాకి సంబంధించిన తొలి పాటను  సెప్టెంబర్ నెల 28వ తారీఖు విడుదల చేశారు "సామజవరగమన" అంటూ సాగిన ఈ పాటలో తమన్ మరియు సిద్ శ్రీరామ్ కలిసి పాటను వాడుతున్నట్లు చూపించారు పాట కోసం నిర్మాత దాదాపు 25 లక్షలు ఖర్చు పెట్టినట్టు తెలుస్తోంది ఈ పాట యూట్యూబ్ లో దాదాపు 6 కోట్లు మంది చూశారు . అంతగా ఈ పాట పాపులర్ అయ్యింది ఇన్ని రోజులు ఇతరుల ట్యూన్స్  కాపీ కొడతాడు అని పేరున్న తమన్ కి  ఈ సినిమా ఆ మచ్చ చేరవేస్తుంది అనే చెప్పాలి.


 అదేవిధంగా ఈ సినిమాలోని రెండో పాటను "రాములో రాముల"  కూడా దీపావళి కానుకగా యూట్యూబ్ లో పెట్టారు ఈ పాట కూడా యూట్యూబ్లోని పలు రికార్డులను కొల్లగొట్టింది. దక్షిణ భారతంలోనే అన్ని భాషలలో కూడా ఒక రోజులో అత్యధిక మంది వీక్షించిన పాటగా రికార్డు సృష్టించింది . ఈ పాటని ఒక రోజులోనే దాదాపు 84 లక్షల మంది చూసారు.


ఇలా పాటలు రిలీజ్ చేయడం ఒక కొత్త మార్కెటింగ్ విధానంగా స్టార్ట్ చేయడం మొదలుపెట్టారు అల వైకుంఠపురంలో నిర్మాతలు దీనివల్ల జనవరిలో రిలీజ్ అవుతున్న ఈ సినిమాకి ప్రమోషన్స్ కూడా ఇప్పటి నుంచే మొదలు పెట్టినట్టు అర్థమవుతూ వస్తుంది. ఈ సినిమా జనవరి 12 న విడుదలకి సిద్ధం అవుతుంది .


మరింత సమాచారం తెలుసుకోండి: