మరో వారం రోజుల్లో బిగ్ బాస్ సీజన్ 3కు ఎండ్ కార్డ్ పడబోతుంది. ప్రస్తుతం బిగ్ బాస్ షోలో వరుణ్ సందేశ్, రాహుల్ సిప్లిగంజ్, శ్రీముఖి, బాబా భాస్కర్, అలీ రేజా మిగిలారు. గ్రాండ్ ఫినాలేలో ఈ ఐదుగురిలో అలీ రేజా విన్నర్ అయ్యే అవకాశం లేదు. బిగ్ బాస్ షో నుండి ఎలిమినేట్ అయిన అలీ రేజా రీ ఎంట్రీ ఇచ్చాడు కాబట్టి అలీ రేజా విన్నర్ అయ్యే అవకాశం లేదు. మిగిలిన నలుగురు ఇంటి సభ్యులలో ఎవరు విన్నర్ అవుతారో చూడాలి. 
 
బిగ్ బాస్ సీజన్ 3 మొదటివారంలోనే ఎలిమినేట్ అయిన హేమ శ్రీముఖి గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది. బిగ్ బాస్ షో నిర్వాహకులపై, శ్రీముఖిపై హేమ ఘాటైన విమర్శలు చేసింది. బిగ్ బాస్ సీజన్ 3 ప్రారంభం కావటానికి కొన్నిరోజుల ముందే శ్రీముఖి బర్త్ డే జరిగిందని ఆ బర్త్ డే వేడుకల్లో అందరూ కలిసి పార్టీ చేసుకున్నారని ఇంటి సభ్యులు నన్ను బయటకు పంపించడమే టార్గెట్ గా పెట్టుకున్నారని హేమ చెప్పింది. శ్రీముఖి బయట ఒకలా లోపల మరో విధంగా మాట్లాడుతుందని హేమ ఆరోపణలు చేసింది. శ్రీముఖి దొంగాటలు ఆడేదని నా ముందు మంచిగా ఉండేదని వెనక మాత్రం మరో విధంగా చెప్పేదని హేమ చెప్పింది. 
 
శ్రీముఖి ఆడే ఆటలో మిగతా ఇంటి సభ్యులు బలవుతున్నారని హేమ చెప్పింది. బిగ్ బాస్ షోలో పాజిటివ్ అంశాలు చూపించరని కేవలం నెగిటివ్ అంశాలు మాత్రమే చూపిస్తారని బిగ్ బాస్ నిర్వాహకులపై హేమ మండిపడింది. హేమ చేసిన వ్యాఖ్యలు శ్రీముఖికి నెగిటివ్ గా మారే అవకాశం ఉంది. మరో వారం రోజుల్లో ఎండ్ కార్డ్ పడనున్న బిగ్ బాస్ షోలోని శ్రీముఖిపై హేమ చేసిన వ్యాఖ్యలు ఎలాంటి ప్రభావం చూపుతాయో చూడాలి. 
 
నిన్నటి ఎపిసోడ్ లో బిగ్ బాస్ షో నుండి శివజ్యోతి ఎలిమినేట్ అయింది. ఎలిమినేట్ కావటంతో శివజ్యోతి చాలా బాధపడింది. నిజానికి శివజ్యోతి గత కొన్నివారాల నుండి నామినేషన్స్ లోకి రాకపోవటంతో ఎలిమినేషన్ నుండి తప్పించుకుందని కొందరు నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 




మరింత సమాచారం తెలుసుకోండి: