టాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించిన టాప్ హీరోల భార్యలలో ఎక్కువగా నమ్రతా అదేవిధంగా స్నేహా రెడ్డిలు పండుగలు వచ్చాయి అంటే చాలు వారు తమ కుటుంబంలో పండుగలను ఎంత ఆనందంగా సెలెబ్రేట్  చేసుకున్నారో ఆ విషయాలను వివరిస్తూ  తమ పండుగ సరదాలకు సంబంధించిన ఫోటోలను షేర్ చేయడం ఒక హాబిగా పెట్టుకున్నారు. ఇలాంటి పరిస్థితులలో బన్నీ భార్య స్నేహ రెడ్డి నిన్న తమ ఇంటిలో దీపావళి సంబరాల సందర్భంగా బన్ని మరియు తన పిల్లలతో కలిసి తీయించుచుకున్న ఫోటోను షేర్ చేసింది.  

ఈ ఫోటో షేర్ కాబడిన కొద్ది సేపటికే ఈ ఫోటోను టార్గెట్ చేస్తూ మహేష్ అభిమానులు బన్నీ భార్యను ఆట పట్టిస్తున్నారు. మహేష్ భార్య నమ్రత అడుగుజాడలలో బన్నీ భార్య పయనిస్తోంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. దీనికి కారణం ఈ మధ్య నమ్రత మహేష్ తో పాటు తన పిల్లలతో కూడ కలిసి ఒక యాడ్ లో నటించింది.

ఇప్పుడు అదే విషయాన్ని మహేష్ అభిమానులు గుర్తుకు చేస్తూ బన్నీ భార్య కూడ తన పిల్లలతో కలిసి ఒక యాడ్ లో నటించడానికి ప్రిపేర్ అవుతోంది అంటూ జోక్స్ వేస్తున్నారు. మహేష్ అభిమానులు వేస్తున్న సెటైర్లలో ఒక వాస్తవం కూడ కనిపిస్తోంది. 

మహేష్ తన భార్య నమ్రత పిల్లలతో కలిసి నటించిన ఒక యాడ్ ఇప్పుడు విపరీతంగా బుల్లితెర పై కనిపిస్తున్న పరిస్థితులలో ఇలాంటి ఆలోచన మరొక వ్యాపార సంస్థకు వచ్చి అల్లు అర్జున్ ఫ్యామిలీ యాడ్ ను రూపొందిస్తే దానికి కూడ మంచి గుర్తింపు వచ్చే ఆస్కారం ఉంది. ఇప్పటికే సంక్రాంతి వార్ మహేష్ బన్నీ అభిమానుల మధ్య వార్ గా మారుతున్న పరిస్థితులలో ఇప్పుడు బన్నీ కూడ నిజంగానే తన ఫ్యామిలీతో యాడ్ రంగంలోకి దిగితే మహేష్ బన్నీల మధ్య ఫ్యామిలీ యాడ్స్ పోటీ కూడ ఏర్పడే ఆస్కారం ఉంది.. 


మరింత సమాచారం తెలుసుకోండి: