బిగ్ బాస్ సీజన్ 3 నవంబర్ 3తో ముగుస్తుంది. ప్రస్తుతం హౌజ్ లో టాప్ 5 ఇంటి సభ్యులు ఉన్నారు. వారిలో ఇద్దరు టాప్ 2లో ఉంటారు. ఇక ఫైనల్ డే రోజు ఆ ఇద్దరిలో ఒకరిని టైటిల్ విజేతగా ప్రకటిస్తారు. బిగ్ బాస్ సీజన్ 3 ఫైనల్ ఎపిసోడ్ కు స్పెషల్ సర్ ప్రైజ్ గెస్ట్ ను ఇన్వైట్ చేస్తున్నారట. ఆయన ఎవరో కాదు మెగాస్టార్ చిరంజీవి బిగ్ బాస్ సీజన్ 3 టైటిల్ విజేతను ప్రకటించి ఆయన చేతుల మీదగా ఆ షీల్డ్ తో పాటుగా క్యాష్ ప్రైజ్ అందచేస్తారని తెలుస్తుంది.


కింగ్ నాగార్జున హోస్ట్ గా నిర్వహిస్తున్న ఈ రియాలిటీ షో ముగింపు దశలో మంచి క్రేజ్ తెచ్చుకుంది. 15 మంది సభ్యులతో మొదలైన బిగ్ బాస్ సీజన్ 3 ఇద్దరు వైల్డ్ కార్డ్ ఎంట్రీతో మొత్తం 17 మందితో వారం వారం ఒకరు ఎలిమినేట్ అవుతూ ఫైనల్ వీక్ లో కేవలం 5 గురు సభ్యులు మాత్రమే ఉన్నారు. 


ఇక వీరిలో టాప్ 2లోకి ఎవరు వెళ్తారన్నది తెలియాల్సి ఉంది. బిగ్ బాస్ సీజన్ 3 ఫైనల్ ఎపిసోడ్ కు మెగాస్టార్ చిరంజీవి చీఫ్ గెస్ట్ గా వచ్చి బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తాడని తెలుస్తుంది. సీజన్ 3 విన్నర్ రేసులో రాహుల్, శ్రీముఖి, వరుణ్ ఉన్నట్టు తెలుస్తుంది. అయితే వీరిలో రాహుల్, శ్రీముఖులకే మొదటి ఛాన్స్ ఉందని తెలుస్తుంది. 


బిగ్ బాస్ సీజన్ 1 విజేతగా శివ బాలాజి టైటిల్ గెలుచుకున్నాడు. ఇక సీజన్ 2లో కౌశల్ టైటిల్ దక్కించుకున్నాడు. అయితే ఈసారి బుల్లితెర క్రేజీ యాంకర్ శ్రీముఖికి టైటిల్ వస్తుందని కొందరు అంటున్నారు. బుల్లితెర యాంకర్లు సైతం శ్రీముఖి గెలవాలని కోరుకుంటున్నారు. మరి ఫైనల్ వీక్ ఆడియెన్స్ ఓటింగ్ ఎలా ఉండబోతాయో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: