ఈమధ్య కాలంలో రవిబాబు తీస్తున్న సినిమాలు వరస పరాజయాలు చెందడంతో రవిబాబుకు కొన్ని అనుకోని ఆర్ధిక కష్టాలు ఎదురయ్యాయి అన్నవార్తలు కూడ వచ్చాయి. తన పరాజయాల షాక్ నుండి తేరుకుని ప్రస్తుతం ఈవిలక్షణ దర్శకుడు తీసిన థ్రిల్లర్ మూవీ ‘ఆవిరి’ ఈ వారం విడుదలకాబోతోంది.

ఈ మూవీని ప్రమోట్ చేస్తూ ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చేసిన కొన్ని కామెంట్స్ అత్యంత ఆశ్చర్యంగా మారాయి. రవిబాబు తండ్రి చలపతిరావుకు ఎన్టీ రామారావుకు అత్యంత సన్నిహిత సాన్నిహిత్యం ఉంది. అలాంటి చలపతిరావు కొడుకు రవిబాబు తన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తాను తెలుగుదేశం పార్టీ అంటే ఇష్టపడను అంటూ షాకింగ్ కామెంట్స్ చేసాడు. 

2014 ఎన్నికలలో ‘బాబు వస్తే జాబు వస్తుంది’ అనే క్యాపక్షన్ తో తాను ఎన్నికల ప్రచారం నిమిత్తం యాడ్స్ చేసిన విషయాన్ని గుర్తుకు చేసుకుంటూ తాను జీవితంలో చేసిన పొరపాట్లలో అది కూడ ఒకటి అంటూ షాకింగ్ కామెంట్స్ చేసాడు. పేద ప్రజలకు సేవ చేయాలని స్థాపించిన తెలుగుదేశం ధనవంతుల పార్టీగా మారిపోయిందని రవిబాబు అభిప్రాయ పడుతున్నాడు. దీనితో రవిబాబుకు తెలుగుదేశం పై అంతకోపం ఎందుకు వచ్చింది అంటూ చాలామంది ఆశ్చర్యపడుతున్నారు. 

అంతేకాదు తన సినిమాను ప్రమోట్ చేస్తూ ఆ సినిమా గురించి మరీ ఎక్కువగా చెప్పకుండా తెలుగుదేశంను టార్గెట్ చేస్తూ రవిబాబు మాట్లాడటం వెనుక మరెవరిదైనా ప్రోత్సాహం ఉందా అన్న సందేహాలు కలుగుతున్నాయి.ఇప్పటికే రవిబాబుకు తండ్రి చలపతిరావుతో చిన్న గ్యాప్ ఉంది అన్న ప్రచారం ఉంది. ఇప్పడు రవిబాబు లేటెస్ట్ గా చేసిన కామెంట్స్ తో ఆ గ్యాప్ మరింత పెరిగే ఆస్కారం కనిపిస్తోంది అన్న కామెంట్స్ కూడ వస్తున్నాయి. ‘ఆవిరి’ మూవీ రవిబాబు కెరియర్ కు అత్యంత కీలకంగా మారిన పరిస్థితులలో రవిబాబు అనవసరపు రాజకీయ రగడకు దిగినట్లు కామెంట్స్ వినిపిస్తున్నాయి..


మరింత సమాచారం తెలుసుకోండి: