వీ6 ఛానల్‌లో తీన్మార్ వార్తలతో టీవీ ప్రేక్షకులకు పరిచయమైన మంగ్లీ... ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా పాపులర్ యాంకర్‌గా పేరు సంపాదించుకుంది. ఆ తర్వాత తెలంగాణ పండగ ‘బతుకమ్మ’ పాటలతో తెలుగు ప్రజల్లో మంగ్లీ మంచి గుర్తింపు సొంతం చేసుకున్నారు. ఇన్నాళ్లూ గాయనిగా, టీవీ యాంకర్‌గా బుల్లితెర వీక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్న ఆమె జబర్దస్త్ లోకి వస్తుంది.


జబర్దస్త్ షో నవ్వులతో ఒక రేంజ్ కి వెళ్తే దాని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళింది అనసూయ మరియు రష్మి అందాలు అనేది చెప్పాలి అలాంటి జబర్దస్త్ కి ఇంకో అందాలభామ ఎంట్రీ ఇస్తుంది.జబర్దస్త్  షో అంటే నవ్వులే నవ్వులు.. ఎంతో మంది ఆర్టిస్టులకు మంచి జీవితాన్ని ప్రసాదించిన కార్యక్రమం అది. ఆ షో కు జడ్జిలుగా వ్యవహరిస్తున్న నాగబాబు, రోజా కూడా ఈ షో తోనే స్టార్‌డమ్ సంపాదించుకున్నారు. సుడిగాలి సుధీర్, చమ్మక్ చంద్ర, హైపర్ ఆది.. తదితర కామెడీ ఆర్టిస్టులందరికీ ఈ షో అన్నం పెడుతోందంటే అతిశయోక్తి కాదు.

గురువారం నాడు ప్రసారమయ్యే జబర్దస్త్, శుక్రవారం నాడు ప్రసారమయ్యే ఎక్స్‌ట్రా జబర్దస్త్ షోలు ప్రేక్షకులకు కావాల్సినంత ఆనందాన్ని, నవ్వుల్ని పంచుతున్నాయి. ఆ షోలకు యాంకర్లుగా వ్యవహరిస్తున్న అనసూయ భరద్వాజ్, రష్మీ గౌతమ్ కూడా తమ అందాలను ప్రదర్శిస్తూ, తియ్యతియ్యని మాటలతో ఆ కార్యక్రమానికి మరింత గ్లామర్ పెంచేశారు. ప్రతీ వారం ప్రసారమయ్యే ఈ షో ద్వారా కొత్త వాళ్లు చాలా మంది బుల్లి తెర మీద కనిపిస్తుంటారు.


అయితే, తాజాగా.. సింగర్, తీన్మార్ మంగ్లీగా తెలుగు వాళ్లకు పరిచయమైన సత్యవతి రాథోడ్ కూడా జబర్దస్త్‌లోకి ఎంట్రీ ఇస్తోంది. శుక్రవారం ప్రసారమయ్యే ఎక్స్‌ట్రా జబర్దస్త్ కార్యక్రమంలో ఆమె కనిపించనుంది. ఇప్పటికే దీనికి సంబంధించి ప్రోమోను విడుదల చేశారు నిర్వాహకులు. అందులో మంగ్లీ గులాబీ రంగు డ్రెస్‌లో కనువిందు చేసింది.


మరింత సమాచారం తెలుసుకోండి: