హాలీవుడ్ సినిమాల్లో నటించేందుకు రెడీ అని డార్లింగ్ ప్రభాస్ అంటుంటే , ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అన్ని భాష సినిమాల్లో నటించాలని ఉంది అంటోంది స్వీటీ అనుష్క .  ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సినిమాతో ప్రభాస్ , అనుష్క జంట  అంతర్జాతీయంగా గుర్తింపు సంపాదించుకున్నారు . లండన్ లో  బాహుబలి చిత్రాన్ని ప్రత్యేక ప్రదర్శన నిర్వహించారు . దీనికి అద్భుతమైన స్పందన లభించింది.  ఈ సందర్భంగా డార్లింగ్ ప్రభాస్,  బ్యూటీ అనుష్క లు  మీడియాతో మాట్లాడారు.  హాలీవుడ్ సినిమాల్లో నటిస్తారా? అని ప్రభాస్ ను  ప్రశ్నించగా  సరైన స్క్రిప్ట్ ఆఫర్ చేస్తే తప్పకుండా నటిస్తానని ... తనకు భాష అడ్డంకి కాదని సినిమాలో నటించడమే తన పని  చెప్పుకొచ్చాడు.


ఇక అనుష్క  ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని భాషల సినిమాల్లో నటించాలని ఉంది అని చెప్పుకొచ్చింది . ప్రభాస్ హీరోగా  నటించిన  సాహో సినిమా ఇటీవల విడుదలై కమర్షియల్ గా  సక్సెసయింది . భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ చిత్రం ఆశించిన స్థాయి లో విజయం సాధించకపోవడం తో తన తదుపరి సినిమా పై దృష్టి సారించాడు .     దర్శకుడు ఎస్ రాధాకృష్ణ రూపొందిస్తోన్న  ప్రేమకథా చిత్రంలో ప్రభాస్ హీరోగా నటిస్తున్నాడు . ఈ చిత్రం లో  పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది . సాహో చిత్రీకరణ కోసం చాల సమయం వెచ్చించిన ప్రభాస్krishna KUMAR' target='_blank' title='రాధా కృష్ణ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>రాధా కృష్ణ రూపొందిస్తోన్న  సినిమా చిత్రీకరణ శరవేగంగా పూర్తి చేయాలని షరతు పెట్టారని ఫిల్మ్ నగర్ వర్గాలు అంటున్నాయి .


  ఇక స్వీటీ అనుష్క ప్రస్తుతం నిశ్శబ్దం  సినిమా లో నటిస్తోంది . ఈ సినిమా ను  హేమంత్ మధుకర్ రూపొందిస్తున్నాడు. బహు బాషా చిత్రంగా రూపొందిస్తోన్న ఈ చిత్రం పై అనుష్క ఎన్నో ఆశలు పెట్టుకుంది .


మరింత సమాచారం తెలుసుకోండి: