ఇండస్ట్రీలో మంచి టైములో కెరియర్ అదిరిపోయే రేంజ్ లో ఉన్న సమయంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వెళ్లటం జరిగింది. సరిగ్గా 2014 ఎన్నికల సందర్భంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రెండుగా చీలిపోయిన ఆ క్రమంలో పవన్ కళ్యాణ్ జనసేన అనే పార్టీని స్థాపించి అప్పట్లో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకి సపోర్టుగా ఉంటూ తెలుగుదేశం పార్టీ కోసం ఆ సమయంలో జరిగిన ఎన్నికలలో పోటీ చేయకుండా చంద్రబాబు ముఖ్యమంత్రి కావడానికి కీలక పాత్ర పవన్ కళ్యాణ్ పోషించారు. అయితే ఆ తర్వాత చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక పవన్ కళ్యాణ్ సినిమాలు చేస్తూనే మరోపక్క రాజకీయాలు కూడా చేస్తుండేవాడు. అయితే అనూహ్యంగా సరిగ్గా 2019 ఎన్నికలకు ఏడాది ముందు గుంటూరులో భారీ బహిరంగ సభ పెట్టి ఇక సినిమాలు చేయకూడదు అని నిర్ణయించుకున్న..నా జీవితం మొత్తం ప్రజాసేవకే అంకితం అంటూ పవన్ కళ్యాణ్ ఆ సమయంలో సినిమాలకు దూరం అయినట్లు ప్రకటించి పూర్తిగా రాజకీయ నాయకుడిగా ప్రజా సమస్యలపై పోరాడుతూ 2019 ఎన్నికల్లో మొట్టమొదటిసారి పోటీ చేసి దారుణంగా ఓడిపోవడం జరిగింది.


ముఖ్యంగా పవన్ కళ్యాణ్ పెట్టిన పార్టీ కేవలం ఒకే ఒక్క స్థానం గెలవడంతో ఆ సందర్భంలో...ఇక పవన్ కళ్యాణ్ రాజకీయాలు చేయడం మళ్ళీ యూటర్న్ తీసుకుని సినిమాల్లోకి వెళ్లిపోతాడు..2019 ఎన్నికల అయిపోయిన తర్వాత ఫలితాలు వచ్చిన సమయంలో అనేక వార్తలు రావటం కామెంట్ రావటంతో...పవన్ కళ్యాణ్ వచ్చిన కామెంట్లకు కౌంటర్లు వేస్తూ...నేను చచ్చిపోయేంత వరకు జనసేన పార్టీ ఉంటుందని రాజకీయ నాయకుడిగా నా పోరాటం ఉంటుందని సినిమాలు చేయనని అప్పట్లో చెప్పడం జరిగింది.


ఇటువంటి తరుణంలో తాజాగా పవన్ కళ్యాణ్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో సినిమా చేయటానికి రెడీ అయినట్లు ఫిలింనగర్ లో గట్టిగా వార్తలు వినబడుతున్నాయి. అంతే కాకుండా ఈ సినిమా షూటింగ్ నవంబర్ నుండి స్టార్ట్ అవుతున్నట్లు ఈ సినిమాకి పవన్ కళ్యాణ్ 50 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ వార్తల్లో నిజమెంతో తెలియాలంటే పవన్ కళ్యాణ్ స్పందించాల్సి ఉంది. మరోపక్క మాత్రం కన్ఫర్మ్ గా పవన్ కళ్యాణ్ సినిమా చేస్తున్నట్లు మెగా కాంపౌండ్ లో టాక్.



మరింత సమాచారం తెలుసుకోండి: