ప్రస్తుతం సినీ పరిశ్రమలో వినపడే మాటలు కాస్టింగ్ కౌచ్.. మీటూ అనేవి. సినీ ఇండస్ట్రీలో కి రావడానికి చాలా మంది భయపడుతున్నారు. ఉన్నవాళ్లు కామాంధుల భారీన పడకుండా జాగ్రత్త పడుతున్నారు.. యాక్టింగ్ పరంగానే కాకుండా నిత్యం పోరాడుతూ వస్తున్నారు. మానన్ని అరచేతిలో పెట్టుకొని తిరుగుతున్నారు. 


ఇటు సింగర్స్ కూడా ఈ భాదలను ఎదుర్కుంటున్నారు.. అసలు విషయానికొస్తే..ప్రముఖ బాలీవుడ్ మ్యూజిక్ కంపోజర్, సింగర్ అను మాలిక్‌ గురించి మరో షాకింగ్ విషయం బయటికి వచ్చింది. ఇటీవల గాయని సోనా మొహాపాత్ర అతనిపై మీటూ ఆరోపణలు చేసింది.. ఆ ఆరోపణలు సోషల్ మీడియాలో రచ్చ చేసిన సంగతి తెలిసిందే.. ప్రస్తుతం ఇప్పుడు మరో సింగర్ అతని పై దుమ్మెత్తి పోస్తున్నారు.


21 ఏళ్ల వయసులో నేను అను మాలిక్ స్టూడియో‌కి వెళ్లాను. నేను పాడిన పాటల సీడీ ఆయనకు చూపిస్తే నచ్చి నాకు ఛాన్స్ ఇస్తాడనుకున్నా. కానీ ఇలా అసహ్యంగా ప్రవర్తిస్తాడని అస్సలు ఊహించలేదు. ఆ సమయంలో అతను సోఫాలో కూర్చుని నా కళ్లను పొగుడుతూ సెక్స్ కోరికలతో మాట్లాడాడు..నాకు ఆ విషయం అర్థమవడంతో నేను అక్కడి నుండి తప్పిం చు కొని వచ్చేసాను. ఆ తర్వాత ఆయనకు కనపడలేదు అంటూ ఓ ప్రముఖ సింగర్ కామెంట్లు చేసింది.


మరో విషమేమంటే.. ఓ పాటల కార్యక్రమంలో పాట పాడినా ఆ సింగర్ ను క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ బాగా పాడారు అంటూ ప్రశంసల వర్షం కురిపించారు.. ఇకపోతే ఆ సింగర్ పెట్టిన కామెంట్ కు ఎక్కడ రిప్లై ఎస్తే ఏమౌతుందో అని సచిన్ సైలెంట్ గా సైడ్ అయ్యాడు.. మీటు పేరుతో ఇంకెంతమంది ఇండస్ట్రీ లో బయటపడతారు అనేది తెలియాల్సి ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: