మెగాస్టార్ చిరంజీవి రీసెంట్ రిలీజ్ సైరా వచ్చి నెల రోజులయిపోయింది. ఇకపై మెగాస్టార్ వరుసగా తన ప్రాజెక్టులను లైన్ లో పెడుతున్నట్టు తెలుస్తోంది. కొరటాల శివతో సినిమా ఈనెల 18నుంచి రెగ్యులర్ షూట్ జరుపుకోనుందని తెలుస్తోంది. వచ్చే సమ్మర్ కి ఈ సినిమా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. ఆమధ్య త్రివిక్రమ్ తో సినిమా అనౌన్స్ చేసారు చిరంజీవి. కొరటాల శివ సినిమా తర్వాత ఈ సినిమా ఉంటుందని వార్తలు వచ్చాయి. అయితే ఇందులో ఓ మార్పు జరిగినట్టు తెలుస్తోంది.

 

 

త్రివిక్రమ్ నెక్స్ట్ మూవీ చిరంజీవితో కాకుండా చరణ్ తో చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. చరణ్ సరిపడే కథ త్రివిక్రమ్ సిద్ధం చేసినట్టు అందుకు చిరంజీవి ఒకే చెప్పినట్టు ఫిల్మ్ నగర్ వార్త. మరోపక్క అగ్ర నిర్మాత అశ్వనీదత్ మెగాస్టార్ తో సినిమా చేయాలని చూస్తున్నాడు. నాగ్ అశ్విన్ కూడా చిరంజీవికి సరిపడే కథ రాస్తున్నాడని అప్పట్లో అశ్వనీదత్ చెప్పిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ కథ ఫైనల్ స్టేజ్ లో ఉందని ఆల్రెడీ ఈ కథపై చిరంజీవి ఆసక్తి చూపాడని అంటున్నారు. బహుశా చిరంజీవి 153వ సినిమా ఇదే కావొచ్చని తెలుస్తోంది. చిరంజీవి ఏప్రిల్ కి కొరటాల శివతో సినిమా పూర్తి చేసే సమయానికి రామ్ చరణ్ చేస్తున్న ఆర్ఆర్ఆర్ మూవీ కూడా దాదాపు పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి. దీంతో చరణ్త్రివిక్రమ్ తో సినిమా, చిరంజీవినాగ్ అశ్విన్ తో సినిమా చేయొచ్చని టాలీవుడ్ టాక్.

 

 

ఈ రెండు కాంబినేషన్లు సెట్ అయితే ఈ సినిమాలపై భారీ అంచనాలు ఖాయం. త్రివిక్రమ్ పెన్ పవర్, టేకింగ్ పవర్ తెలిసిందే. నాగ్ అశ్విన్ మహానటితో తానేంటో నిరూపించుకున్నాడు. మరి ఈ వార్తల్లో నిజమెంతో తెలియాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: