ఆత్మాహుతి దాడితో భారత ప్రధాని నరేంద్ర మోదీని అంతం చేస్తానంటూ ప్రకటించిన పాకిస్తాన్‌ పాప్‌ సింగర్‌ రబీ పిర్జాదా నగ్న వీడియో శుక్రవారం ఉదయం లీక్‌ అయింది. ఇది ఇప్పుడు సోష‌ల్ మీడియాలో జోరుగా వైర‌ల్ అవుతోంది. దీనిపై ర‌క‌ర‌కాల సందేహాలు కూడా వ్య‌క్త‌మ‌వుతున్నాయి. అసలు విష‌యంలోకి వెళితే పాక్‌ ఆర్మీలో పీఆర్‌ విభాగం ‘కాఫ్‌ కంగనా’ పేరుతో ఓ సినిమాను నిర్మించింది. ట్రైలర్‌ కూడా రిలీజైన ఈ సినిమాలో భారత హిందూ అమ్మాయి, పాక్‌ ముస్లిం అబ్బాయి మధ్య ప్రేమ కథాంశం.


ఇక ఈ సినిమాలో ఓ ఐటెం సాంగ్ ఉంది. ఇది మ‌న తెలుగు సినిమాల్లో ఉండే ఐటెం సాంగ్‌ల‌ను మించి ఉంది. దీనిపై పాక్‌లో చాలా మంది అభ్యంత‌రం కూడా పెట్టారు. ఈ సినిమాలో నీల‌మ్ మునీర్ అనే పాక్ న‌టి భార‌తి యువ‌తి పాత్ర‌లో ప్రేమికురాలిగా న‌టించింది. ఆమె ఈ ఐటెం సాంగ్‌లో న‌ర్తించింది. ఈ వివాదంపై ఇప్ప‌టికే  ఆ పాత్ర‌లో న‌టించిన నీలమ్‌ మునీర్‌, పీఆర్‌ డీజీ ఆసిఫ్‌ గపూర్‌ వివరణ ఇచ్చారు.


వివ‌ర‌ణ ఇచ్చినా ఆ ఐటెం సాంగ్‌పై విమ‌ర్శ‌లు ఆగ‌లేదు. ఈ క్ర‌మంలోనే పాక్ ప్ర‌ముఖ పాప్ సింగ‌ర్  రబీ పిర్జాదా కూడా వీరిని లక్ష్యంగా చేసుకొని విమర్శించింది. ఆమె ఆ విమ‌ర్శ‌లు చేసిన గంటకే ఆమె న‌గ్న వీడియో లీక్ అయ్యింది. ఈ వీడియోను రబీ మాజీ ప్రియుడు లీక్‌ చేశాడని భావిస్తున్నారు. మాజీ ప్రియుడి వెనక ఆసిఫ్‌ గపూర్‌ ప్రోద్బలం ఉన్నట్టు అనుమానాలు వ్య‌క్తం అవుతున్నాయి. ఈ విష‌యం ఇప్పుడు పాక్‌లో హాట్ టాపిక్‌గా మారింది. రబీ గతంలో మోదీని చంపడానికి తన వద్దనున్న పాములు, మొసళ్లను వదులుతానంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది.  



మరింత సమాచారం తెలుసుకోండి: