తెలుగులో సక్సెస్ హీరోయిన్ అంటే వెంటనే గుర్తొచ్చే పేరు సమంత.. ఎం మాయ చేసావే సినిమాతో తెలుగు సినిమాతో అరంగ్రేటం చేసిన ఈ బ్యూటీ.. ఆ తరువాత ఒక్కో సినిమాలో నటిస్తూ వరుస విజయాలతో దూసుకుపోతుంది. అలా సినిమా సినిమాకు కొత్తగా కనిపిస్తూ ప్రేక్షకులను అలరిస్తూ వస్తుంది. చాలా మంది సరసన నటించి మంచి పేరు సంపాదించింది. ఆ విదంగా ఆమె సక్సెస్ ను అందుకుంది. 
 
పెళ్లయ్యాక చాలా మంది సినిమాలకు దూరమవుతారు. ఇల్లు సంసారం పిల్లా, పాపలతో జీవించాలని చాలా మంది అనుకోని సినిమాలకు పూర్తిగా దూరమవుతారు. అలాంటిది అక్కినేని కోడలైన సమంత సినిమాలకు మరింత దగ్గరయ్యారు. ఆమె సినిమాలకు బాగానే ఒప్పుకుంది. ముందు కన్నా కూడా పెళ్లైయ్యాక సినిమాలు ఎక్కువగా చేస్తూ వస్తుంది. పెళ్లైయ్యాక సామ్ చేసిన సినిమాలు రంగస్థలం, మజిలీ, యూ టర్న్, ఓ బేబీ సినిమాలు చేసింది. ఈ సినిమాలన్నీ ఒక్కొక్కటి ఒక్కోవిదంగా ఉన్నాయి. ఆ సినిమాలన్నీ టాలీవుడ్ లో బాగా హిట్ అయ్యాయి. ప్రేక్షకుల మనసులో ఆ సినిమాలన్నీ బాగా చెరగని ముద్ర వేసుకుంది. ఇకపోతే ఈమెతో ఏ డైరెక్టర్ సినిమా తో సినిమా చేసిన కూడా ఆ సినిమాలన్నీ హిట్ అయ్యాయి. 


సామ్ చూడటానికి సన్నగా ఉన్న కూడా ఫిట్ నెస్ విషయంలో ఎప్పుడు ముందు ఉంటుంది. ఎంత తిన్నామన్నది కాదు.. ఎంత ఫిట్ గా ఉండాలో తెలుసుకోవాలి అని సామ్ అంటుంటుంది. దానికోసం ఈమె చాలా కష్టపడుతూ వస్తుంది.. జిమ్ లో గంటల తర్పబడి ఉంటుంది. జిమ్ లో కష్టపడే వీడియోస్ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలోపోస్ట్ చేస్తూ వస్తుంది. ఆమె చేసే కసరత్తులు విన్యాసాల్లాగా కనిపిస్తున్నాయి. నెగిటివ్ రోల్స్ చేయబోతుంది. ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి.. 


అసలు విషయానికొస్తే సామ్ సోషల్ మీడియాలో చురుకుగా ఉంటున్న విషయం తెలిసిందే.. ఎక్కడకు వెళ్లిన కూడా అక్కడ ఫోటోలను దిగడంతో లేక వీడియోలను తీయడంలో చేస్తూ వైరల్ అవుతున్న సంగతి అందరికి తెలుసు. తాజాగా కొన్ని ఫోటోలను షేర్ చేసింది ఆ ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుకుతున్నాయి. యూత్ వాటిని షేర్స్ చేయడంతో పాటుగా కామెంట్లు పెడుతున్నారు..  


మరింత సమాచారం తెలుసుకోండి: