విజయ్ దేవరకొండ తనకు ఇప్పట్లో పెళ్ళి చేసుకునే ఉద్దేశ్యం లేదనీ ఇప్పటికే క్లారిటీ ఇచ్చాడు. అయితే విజయ్ ప్రేమకథను దేవరకొండ ఊరు నేపధ్యంలో చెప్పడానికి ప్రయత్నిస్తున్న ఒక యంగ్ డైరెక్టర్ ప్రయోగం ఇప్పుడు ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది. విజయ్ దేవరకొండ పేరును పరోక్షంగా వాడుకుంటూ ‘దేవరకొండలో విజయ్ ప్రేమకథ’ అన్న మూవీ సెరవేగంగా నిర్మాణం జరుపుకుంటోంది. 

విజయ్ శంకర్ మౌర్యాని అనే కొత్త హీరో హీరోయిన్స్మూవీ ద్వారా పరిచయం కాబోతున్నారు. వెంకట్ రమణ అనే కొత్త దర్శకుడు ఈ మూవీని తీస్తున్నాడు. ఈ మూవీకి సంబంధించిన పోస్టర్ ను లేటెస్ట్ గా హీరో శ్రీకాంత్ లాంచ్ చేయడంతో ఇప్పుడు ఈమూవీ టైటిల్ విజయ్ అభిమానుల మధ్య హాట్ టాపిక్ గా మారడమే కాకుండా తమ హీరోకు పెరిగిపోతున్న క్రేజ్ ను చూసి మురిసి పోతున్నారు. 

హీరోల పేరును టైటిల్ గా పెట్టుకుని గతంలో కూడ కొన్ని సినిమాలు ఇలా వచ్చాయి. మెగా స్టార్ చిరంజీవి క్రేజ్ ను వాడుకుంటూ ‘మా నాన్న చిరంజీవి’ అన్న మూవీ గతంలో వచ్చింది. అదేవిధంగా వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పేరుతో ‘డాటరాఫ్ వర్మ’ అన్న సినిమా కూడ విడుదలైంది. అయితే ఈ ప్రయోగాలు పెద్దగా సక్సస్ కాలేదు. కానీ విజయ్ దేవరకొండ మ్యానియాను దృష్టిలో పెట్టుకుని తమ సినిమా అందరికీ తెలియడానికి ఇలాంటి ప్రయోగం చేస్తున్నారు అనుకోవాలి. 

ఇది ఇలా ఉండగా నిన్న విడుదలైన ‘మీకు మాత్రమే చెప్తా’ మూవీని ప్రమోట్ చేయడానికి నిన్న ఉదయం విజయ్ దేవరకొండ ప్రసాద్ ఐమాక్స్ ధియేటర్ వద్దకు కు వెళ్ళి సైలెంట్ గా బుకింగ్ కౌంటర్ లో కూర్చ్చుని టిక్కెట్స్ అమ్మడం అదేవిధంగా అభిమానులతో సెల్ఫీ లు తీసుకున్న సంగతి వైరల్ గా మారడంతో గా ప్రసాద్ ఐమాక్స్ వద్ద విపరీతమైన హడావిడి జరిగింది. దీనితో రానున్న రోజులలో హీరోలు తమ సినిమాలను ప్రమోట్ చేసుకోవడం కోసం ఇలా రకరకాల ప్రయత్నాలు చేస్తే కానీ ధియేటర్లలోకి ప్రేక్షకులు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు...  


మరింత సమాచారం తెలుసుకోండి: