వరస పరాజయాలతో సతమతమైపోతున్న రవితేజ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘డిస్కో రాజ’ పరిస్థితి అత్యంత ప్రమాదకరంగా మారింది అని వార్తలు వస్తున్నాయి. వాస్తవానికి ఈ మూవీని సుమారు 17 కోట్ల బడ్జెట్ తో పూర్తి చేయాలి అని నిర్మాత రామ్ తాళ్ళూరి భావిస్తే ఈ మూవీ దర్శకుడు వి.ఐ.ఆనంద్ వ్యవహారశైలి వల్ల ఈ మూవీ బడ్జెట్ 22 కోట్లు దాటేసింది అన్న వార్తలు వినిపిస్తున్నాయి.

మూవీ రిలీజ్ కు రెడీ అయిన నేపధ్యంలో ఈ మూవీ ప్రమోషన్ నిమిత్తం ఖర్చు పెట్టవలసిన మొత్తాలు వడ్డీలు అన్నీ కలుపుకుంటే ఈ మూవీ నిర్మాత నష్టాలు లేకుండా బయట పడాలి అంటే కనీసం ఈ మూవీని 25 కోట్ల రేంజ్ కి మించి మార్కెట్ చేయవలసిన పరిస్థితి ఏర్పడింది అని అంటున్నారు. రవితేజ మూవీలకు బిజినెస్ ఏమాత్రం జరగని పరిస్థితులలో ప్రస్తుతం ఈ సినిమాను 25 కోట్ల స్థాయిలోమార్కేట్ చేయడం చాల కష్టం అన్న అభిప్రాయాలు ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తున్నాయి.

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ పరిస్థితి ఏ మాత్రం బాగానేని పరిస్థితులలో సీనియర్ హీరోల సినిమాలను చూసే ప్రేక్షకులు రోజురోజుకు తగ్గ పోతున్నారు. దీనికితోడు ప్రస్తుతం రావితేజాకు యూత్ లో కానీ అదేవిధంగా అమ్మాయిలలో కానీ ఎటువంటి క్రేజ్ లేని పరిస్థితిలో ఈ మూవీని నిర్మాతలు చెప్పిన భారీ రేట్లకు కొనడానికి బయ్యర్లు భయపదిపోతున్నారని టాక్.

దీనికితోడు ఈ మూవీలో హీరోయిన్ గా నటించిన పాయల్ రాజ్ పుట్ కు ఐరన్ లెగ్ హీరోయిన్ గా ముద్ర పడటంతో అటు హీరోకు ఇటు హీరోయిన్ కు క్రేజ్ లేని మూవీని కొనడానికి ప్రస్తుతం ఎవరూ సాహసించక పోవడంతో ఈ మూవీని డిసెంబర్ రేసు నుండి తప్పించినట్లు వార్తలు వస్తున్నాయి. దీనితో ఈ సినిమాను అమ్మకుండా సరైన రిలీజ్ డేట్ దొరికినప్పుడు ఈ మూవేని విడుదల చేయాలని ఈ మూవీ నిర్మాత రామ్ తాళ్లూరి భావిస్తున్నట్లు టాక్. ఈ మూవీ కూడ పరాజయం చెందితే ఇక రవితేజ కెరియర్ పూర్తి అయిపోయినట్లే అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు..  


మరింత సమాచారం తెలుసుకోండి: