తెలుగు బిగ్‌బాస్ సీజ‌న్ 3 విజ‌య‌వంతంగా ముగిసింది. మొత్తం 15 వారాల పాటు కొన‌సాగిన ఈ షో ఆదివారం జ‌రిగిన గ్రాండ్ ఫినాలేతో ముగిసింది. ఈ టైటిల్‌ను ప్ర‌ముఖ సింగ‌ర్ రాహుల్ సిప్లిగంజ్ గెలుచుకున్నాడు. మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదగా రూ.50 లక్షల నగదు బహుమతి, ట్రోఫీని అందుకున్నాడు. సింగర్ రాహుల్ సిప్లిగంజ్ విజేతగా నిలవగా.. యాంకర్ శ్రీముఖి రన్నరప్‌గా నిలిచింది.


ఇక రాహుల్ విష‌యానికి వ‌స్తే ముందు నుంచి హౌస్‌లో ఎలాంటి అంచ‌నాలు లేకుండా ఉన్నాడు. ఇంకా చెప్పాలంటే షోలో అండ‌ర్ డాగ్ కంటెస్టెంట్‌గా కూడా ఉన్నాడు. అత‌డి కంటే ఫైన‌ల్స్‌లో ఉన్న శ్రీముఖి, అలీ రెజా, వ‌రుణ్ సందేశ్‌, బాబా భాస్క‌ర్ వీళ్లంతా స్ట్రాంగ్ కంటెస్టెంట్లుగానే ఉండేవారు. అలాంటి రాహుల్ ప్ర‌తి వారం ఎలిమినేష‌న్లోకి వెళ్లి సేవ్ అవుతూ వ‌చ్చాడు. అత‌డు హౌస్లో ఏకంగా 10 వారాలు నామినేష‌న్‌ను ఫేస్ చేశాడు.


అలా క్ర‌మ‌క్ర‌మంగా ప్రేక్షకులకు దగ్గరవుతూ ఫైనల్ వరకు చేరాడు. ఇంకా చెప్పాలంటే చివ‌ర్లో రాహుల్ ప్ర‌తి విష‌యంలోనూ ఓపెన్‌గా ఉండ‌డం.. లోప‌ల దాచుకునే మ‌న‌స్త‌త్వం లేక‌పోవ‌డంతో పాటు శ్రీముఖికి టార్గెట్ కావ‌డంతో శ్రీముఖి యాంటీ ఫ్యాన్స్ అంద‌రూ రాహుల్‌కు ద‌గ్గ‌ర‌య్యారు. లోప‌ల పున‌ర్న‌వితో అత‌డు న‌డిపిన ప్రేమాయ‌ణం కూడా ప్ల‌స్ అయ్యింది. బ‌య‌ట‌కు వ‌చ్చాక పునర్న‌వి రాహుల్ కోసం బాగా క్యాంపెయిన్ ర‌న్ చేసింది. ఇవ‌న్నీ రాహుల్‌ను గెలిపించాయి.


చివరికి అత్యధిక ఓట్ల మెజార్టీతో రాహుల్ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. రాహుల్‌కి అత్యధికంగా 35 శాతం ఓటింగ్ నమోదైనట్లు తెలుస్తోంది. శ్రీముఖికి 28 శాతం, బాబా భాస్కర్‌కు 20%, వరుణ్ సందేశ్‌కు 10%, అలీ రెజాకు 7% ఓటింగ్ వచ్చినట్లుగా సమాచారం. ఇక ముందు నుంచి చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్‌గా ఉన్న శ్రీముఖి చివ‌ర్లో ఓటింగ్ రేసులో వెన‌క‌ప‌డిపోయింది.


మరింత సమాచారం తెలుసుకోండి: