ఎంత పెద్ద స్టార్ అయినా రిలీజ్ సీజన్ వెరీ ఇంపార్టెంట్. ఈ విషయం బాగా తెలిసిన మెగాస్టార్ ఈ సారి వచ్చే సమ్మర్ ను టార్గెట్ చేశాడు. వేసవి సెలవుల్లో చిరు బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల మోత మోగించేందుకు ప్రిపేర్ అవుతున్నాడు. మెగాస్టార్ బూస్టింగ్ తో దర్శకుడు కొరటాల శివ జెట్ స్పీడ్ పెంచబోతున్నాడట. 


సైరా సినిమా కోసం రెండేళ్ల గ్యాప్ తీసుకున్న మెగాస్టార్ ఇక జెట్ స్పీడ్ పెంచబోతున్నాడు. సైరా బాక్సాఫీసు రికార్డ్స్ తిరగరాయకపోయినా.. దసరా సీజన్ లో రావడం వల్ల భారీ కలెక్షన్లను దక్కించుకుంది. ఈ విషయాన్ని పసిగట్టిన మెగాస్టార్, కొరటాల శివ దర్శకత్వంలో నటిస్తున్న కొత్త సినిమాను వేసవిలో రిలీజ్ చేయాలని టార్గెట్ గా పెట్టుకున్నట్టు సమాచారం.


చిరంజీవి, కొరటాల శివ సినిమా ఈ మధ్యనే లాంచింగ్ జరుపుకుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జెట్ స్పీడ్ తో సాగుతున్నాయి. నవంబర్ సెకండ్ వీక్ నుండి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టనున్నట్టు టాక్. కొరటాల చేతిలో పక్కా స్క్రిప్ట్ రెడీగా ఉంది. ప్లానింగ్ సైతం అంతా పర్ ఫెక్ట్ గా ఉండటంతో కేవలం ఐదు నెలల్లో షూటింగ్ పూర్తి చేసి.. సమ్మర్ కానుకగా మేలో ఆడియన్స్ ముందుకు తీసుకురావాలని టార్గెట్ గా పెట్టుకున్నట్టు తెలుస్తోంది. 


సమ్మర్ సీజన్ అయితేనే బాక్సాఫీసు దగ్గర కలెక్షన్స్ నమోదు చేయవచ్చని చిరు, కొరటాల భావిస్తున్నారట. రాజమౌళి తర్వాత హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ రేట్ ఉన్న దర్శకుడిగా కొరటాల రికార్డ్ ఉంది. కొరటాల డైరెక్షన్ లో వర్క్ చేసిన స్టార్స్ కి కెరీర్ లో నిలిచిపోయే హిట్స్ ఇచ్చాడు. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవికి కొరటాల శివ ఎలాంటి సినిమా ఇవ్వబోతున్నాడనేది వెరీ ఇంట్రెస్టింగ్ గా మారింది. ఎప్పటిలాగే కొరటాల.. చిరంజీవితో సైతం సోషల్ కాజ్ ఉన్న స్టోరీని హ్యాండిల్ చేస్తున్నట్టు తెలుస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: