పవన్ కళ్యాణ్ ‘పింక్’ రీమేక్ లో నటించడానికి అంగీకారాన్ని తెలిపే విషయంలో చాల పెద్ద వ్యవహారమే నడిచిందని ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాలలో వార్తలు హడావిడి చేస్తున్నాయి. ఈ మూవీని నిర్మిస్తున్న దిల్ రాజ్ బోనీకపూర్ లు చేయలేని మ్యాజిక్ త్రివిక్రమ్ తన మాటలమాయతో చేసాడు అన్న గాసిప్పులు సందడి చేస్తున్నాయి. 

వాస్తవానికి ‘పింక్’ రీమేక్ విషయంలో పవన్ తన నిర్ణయాన్ని వచ్చే ఏడాది జనవరి తరువాత చెపుతానని దిల్ రాజ్ కు అదేవిధంగా బోనీకపూర్ కు చెప్పినట్లు సమాచారం. అయితే ఈమూవీని పవన్ తో తీయడమే ప్రధాన ధ్యేయంగా వ్యూహాలు నడుపుతున్న దిల్ రాజ్ బ్రహ్మాస్త్రంగా త్రివిక్రమ్ ను పవన్ పై ప్రయోగించడంతో ‘పింక్’ రీమేక్ సాధ్యం అవుతోంది అన్నవార్తలు వస్తున్నాయి. 

వాస్తవానికి ఈమూవీకి నిర్మాతలుగా దిల్ రాజ్ బోనీకపూర్ లు వ్యవహరిస్తున్నా బయటపడని సీక్రెట్ నిర్మాత త్రివిక్రమ్ అని అంటున్నారు. పవన్ ఈమూవీ రీమేక్ లో నటించడానికి ఒప్పిస్తే త్రివిక్రమ్ ఒక్కరూపాయి పెట్టుబడి పెట్టకుండా ఈమూవీకి వచ్చే లాభాలలో 30 శాతం వాటా ఇస్తామని దిల్ రాజ్ చెప్పిన మాటలకు త్రివిక్రమ్ ఆశపడి తనవంతు ప్రయత్నాలను పవన్ వద్ద చేయడమే కాకుండా ‘పింక్’ రీమేక్ పవన్ కు అన్నివిధాల సరిపోతుంది అన్నవిషయాన్ని వివరంగా చెప్పడమే కాకుండా పవన్ భావజాలానికి అనుగుణంగా తాను ఈమూవీకి డైలాగ్స్ తో పాటు స్క్రీన్ ప్లే కూడ వ్రాసి ఇస్తాను అని త్రివిక్రమ్ చెప్పడంతో పవన్ ఈమూవీ రీమేక్ కు బుట్టలో పడిపోయాడు అన్నవార్తలు వస్తున్నాయి. 

ఇప్పుడు ఈవార్తలు ఇలా వైరల్ కావడంతో పవన్ తో తన స్నేహాన్ని తెలివిగా త్రివిక్రమ్ బిజినెస్ గా మార్చుకున్నాడా అంటూ కొందరు ఆశ్చర్యపోతున్నారు. వాస్తవానికి ‘పింక్’ బాలీవుడ్ లో కాని అదేవిధంగా కోలీవుడ్ లో కాని రికార్డులు క్రియేట్ చేయలేదు కేవలం మంచిసినిమాగా పేరు తెచ్చుకుంది. అయితే ప్రస్తుతం పవన్ కు తన రీఎంట్రీ మూవీకి సంబంధించి కావలసింది రికార్డులు ఆవిషయాలను మరిచిపోయి పవన్ ఒక మంచి కథతో కూడిన రీమేక్ నటించడం వలన పవన్ ఇమేజ్ వల్ల బిజినెస్ జరుగుతుంది కానీ రికార్డులు ఎలా వస్తాయి అన్నది వేచి చూడవలసిన విషయం..   



మరింత సమాచారం తెలుసుకోండి: